సిరిసిల్ల న్యూస్:
సిరిసిల్లలోని గాంధీనగర్, మార్కెట్ ఏరియాలో శ్రీ తుల్జా భవాని సేవా సమితి ఆద్వర్యంలో దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహించి ఈ రోజు పౌర్ణమి సందర్బంగా అమ్మ వారిని మేలుకొలిపి “మహా అన్నదానం” చేయడం జరిగింది.
నవరాత్రి ఉత్సవాలలో నిత్య అన్నదానం నిర్వహించడంతో పాటు ఈ రోజు మహా అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది.
ఇట్టి మహా అన్నదాన కార్యక్రమాన్ని స్థానిక వార్డు కౌన్సిలర్ గుండ్లపెల్లి నీరజ పూర్ణచందర్ గారు మరియు శ్రీ తుల్జా భవాని సేవా సమితి గౌరవ అధ్యక్షులు, మాజీ కౌన్సిలర్ గుండ్లపెల్లి పూర్ణచందర్ గారు ప్రారంభించడం జరిగింది. అమ్మవారి యొక్క కరుణాకటాక్షాలు ప్రజలందరి పైన ఉండి సుఖసంతోషాలతో ఉండే విధంగా అమ్మవారి ఆశీస్సులు ఉండాలని అమ్మవారిని వేడుకోవడం జరిగింది.
ఇట్టి కార్యక్రమంలో అధ్యక్షులు శ్రీరాముల రవీందర్ గారు, అన్నల్ దాస్ సాయిలు గారు, సాప పురుషోత్తం గారు, అన్నల్ దాస్ బలరాం గారు, చిలుక శ్రీనివాస్ గారు, అంకం సాయి కుమార్ గారు, చిప్ప శ్రీకాంత్ గారు, బత్తుల శంకర్ గారు, వలుస లక్ష్మణ్ గారు, వలుస చంద్రశేఖర్ గారు, వాసాల లక్ష్మినారాయణ గారు, గోశికొండ మురళి గారు
తీగల రాజు గౌడ్ గారు, రాజయ్య గారు, సాప సతీష్ గారు, సాప జనార్థన్ గారు మరియు భక్తులు పాల్గొన్నారు.