-భారీ ఎత్తున కాంగ్రెస్ పార్టీలోకి చేరిక కండువా కప్పిపార్టీలోకి ఆహ్వానించిన అది శ్రీనివాస్.
రాజన్న సిరిసిల్ల జిల్లా
చందుర్తి మండలంలోని జోగపూర్ గ్రామంలో గడప గడప కు కాంగ్రెస్ పార్టీ ప్రచారం నిర్వహించారు.ఈ కార్యక్రమానికి వేములవాడ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి ఆది శ్రీనివాస్ ముఖ్య అతిథులుగా హాజరై గడప గడపకు ప్రచారం నిర్వహించారు.. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నవంబర్ 30 నాడు ఎమ్మెల్యే ఎన్నికలు జరగబోతున్న నేపథ్యంలో మీ బీసీ బిడ్డగా మీ ముందుకు వస్తున్న నన్ను ఆదరించి చేతి గుర్తుపై మీ అమూల్యమైన ఓటును వేసి ఒక్కసారి అవకాశం ఇవ్వాలని కోరారు..
గడిచిన పది సంవత్సరాలుగా వాళ్ళ చేతిలోనే అధికారంలో ఉన్నప్పటికీ కూడా అభివృద్ధి గురించి పట్టించుకోని వాళ్ళు ఇప్పుడు ఎన్నికలకు ముందు జిరాక్స్ పేపర్ చేతులో పెట్టీ వివిధ కుల సంగాల పెద్దలను మోసం చేస్తున్న బీఆర్ఎస్ పార్టీ నాయకులకు బుద్ది చెప్పాలన్నారు..
అధికారం ఉన్న లేకున్నా ప్రతి రోజూ ప్రజల మధ్యలో మీ బిడ్డగా ఉన్నానని అన్నారు.. జోగారావు చెరువు ,మల్యాల మధ్యలో పంపులు 2009 కంటే ముందు మనం ప్రాజెక్ట్ నిర్మాణం చేసుకుంటే వాటి ద్వారా మన రైతుల పొలాలకు ఉపకాలువల ద్వారా నీళ్లు తీసుకురావడం కూడా చేతగాని బీఆర్ఎస్ ప్రభుత్వం మనకు అవసరమా అని అన్నారు.
నీళ్లు,నిధులు, నియమాకల కోసం కొట్లాడి తెచ్చుకున్నా తెలంగాణ రాష్ట్రంలో నిధులు కేసీఆర్ కుటుంబానికి, నీళ్లు కేసీఆర్ ఫామ్ హౌస్ కి, నియామకాలు కేసీఆర్ కుటుంబంలో ఐదుగురుకి వచ్చియన్నారు..
కొందరు వ్యక్తులు మన ప్రాంతానికి వచ్చి కల్లబొల్లి మాటలు చెప్పి వాళ్ళకి ఓటు వేయకుంటే పెన్షన్లు రావు అని భయబ్రాంతులకు గురి చేస్తున్నారని,కానీ కవిత,వినోద్ కుమార్ లు పార్లమెంట్ సభ్యులుగా ఓడిపోయిన మీ పెన్షన్లు అగాయా అని అన్నారు..కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే అరు గ్యారెంటీలను అమలు చేస్తామని అన్నారు..ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు చింతపండు రామస్వామి,ఎంపిటిసి మేకల గణేష్ ఉపసర్పంచ్ గంట మల్లేశం,కో ఆప్షన్ సభ్యులు మేకల పరుశరాములు,మాజీ సర్పంచ్ నాగం రాయమల్లయ్య నాయకులు ముసుకు ముకుంద రెడ్డి,కొట్టే ప్రభాకర్,పులి సత్యం వేల్పుల దేవస్వామి,బొజ్జ మల్లేశం, ధర్మపురి శ్రీనివాస్,ఎండీ సలీం,వరికెల ముకుందం,చింతం శంకరయ్య,నాగం గణేష్,నాగం మురళి,పోతుగoటి రంజిత్,దూది శ్రీనివాస్,గద్దరాశి రాజు,వేముల శ్రీను,సంతపురి బాలు,ముత్యాల కృష్ణహరి,మెరుపుల రాజేందర్,అయోధ్య పుట్టయ్య,శ్రీనివాస్,రాజు,మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు..