కన్నుల పండుగగా శ్రీశాల శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి రథోత్సవం
వేలాదిగా తరలివచ్చి స్వామి వారిని దర్శించుకున్న భక్తులు
సిరిసిల్ల న్యూస్:
సిరిసిల్ల పట్టణం లో శ్రీ లక్ష్మి వెంకటేశ్వర స్వామి వారి బ్రహ్మోత్సవాలలో భాగంగా ఈ రోజు నిర్వహించిన రథోత్సవ వేడుకలు కన్నుల పండుగగా జరిగాయి. కొన్ని వందల సంవత్సరాల చరిత్ర గల శ్రీ లక్ష్మి వెంకటేశ్వర స్వామి దేవాలయం లో ప్రత్యేకంగా అలంకరించిన స్వామి వారిని భక్తులు, పట్టణ ప్రముఖులు ఉదయం నుండే దర్శించుకున్నారు, అలాగే రథంపై కొలువుదీరిన ఉత్సవ విగ్రహాలను కూడా భక్తులు పెద్ద ఎత్తున దర్శించుకున్నారు. స్వామి వారి ప్రత్యేక పూజ కార్యక్రమాలలో మున్సిపల్ చైర్ పర్సన్ జిందం కళ చక్రపాణి, టీఎస్పిటిడిసి చైర్మన్ గూడూరి ప్రవీణ్ కుటుంబ సమేతంగా పాల్గొని స్వామి వారిని దర్శించుకున్నారు. జిందం కళ చక్రపాణి మాట్లాడుతూ ఆధ్యాత్మిక వాతావరణం లో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలను నిర్వహిస్తూ, బ్రహ్మోత్సవాలలో భాగంగా స్వామివారి రథోత్సవ కార్యక్రమంను భక్తులకు ఎలాంటి ఇబ్బందులు ఏర్పడకుండ తగు జాగ్రత్తలు తీసుకుంటూ ఎంతో వైభవంగా నిర్వహిస్తున్న దేవాలయ పాలకమండలికి అభినందనలు తెలిపారు. బ్రహ్మోత్సవాలను విజయవంతం చేయాలని, ఇట్టి బ్రహ్మోత్సవాల ఏర్పాట్లలో భాగంగా పురపాలక సంఘం నుండి చేపట్టవలసిన అన్ని చర్యలు చేపట్టడం జరిగిందని ముఖ్యంగా రథోత్సవంలో భక్తులకు ఎలాంటి ఇబ్బంది ఏర్పడకుండ సంబంధిత అధికారులను సమన్వయం చేస్తూ అన్ని ఏర్పాట్లు చేయడం జరిగిందని అన్నారు. ఈ రథోత్సవం లో సిరిసిల్ల టౌన్ సిఐ ఉపేందర్ దంపతులు, కౌన్సిలర్ సభ్యులు పత్తిపక పద్మ శంకర్, గుండ్లపల్లి నీరజా పూర్ణ చందర్, గుడ్ల శ్రీనివాస్, అన్నారం శ్రీనివాస్, పుర ప్రముఖులు, పద్మశాలి కుల బాంధవులు, శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవాలయం అధ్యక్షులు ఉప్పుల విట్టల్ రెడ్డి, ధర్మ కర్తలు, భక్తులు పాల్గొన్నారు.