-అటవీ భూములపై అక్రమార్కుల కన్ను..
-అటవీ భూముల కాపాడాలని రైతుల వేడుకోలు..
సిరిసిల్ల న్యూస్: (రుద్రంగి)
రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రoగి మండలంలోని నల్లగుట్ట అటవీ ప్రాంతంలో అటవీ చెట్లను ధ్వంసం చేసి అటవీ భూమిని కొందరు వ్యక్తులు అక్రమించుకోవలని చూస్తున్నారని ఆ ప్రాంత రైతులు అన్నారు..ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ ఆదివారం రోజున నల్లగుట్ట అటవీ ప్రాంతంలో టేకు చెట్లను,వివిధ రకాల పండ్ల చెట్లను నరికి వేసి భూమిని ఆక్రమించుకోవాలని చూస్తున్నారని అన్నారు.. ఈ విషయంపై వెంటనే అటవీ శాఖ అధికారులకు సమాచారం ఇచ్చామని తెలిపారు.. ఫారెస్ట్ అధికారులు వచ్చి అడవిని ధ్వంసం చేస్తే చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని చెప్పిన వారి మాటలు లెక్క చేయకుండా అడవి చెట్లను ధ్వంసం చేశారని రైతులు వాపోయారు..అడవి చెట్లను నాశనం చేసి భూమి ఆక్రమించుకోవాలని చూస్తున్నా వారిపై ఫారెస్ట్ అధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు.. అడవిని ధ్వంసం చేసి అటవీ భూములను ఆక్రమించుకోవడం రుద్రంగిలో ఏదేచ్ఛగా కొనసాగుతున్న అధికారులు పట్టించుకోకుండా చోద్యం చూస్తున్నారని గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.. ఇప్పటికైనా భూ కబ్జాకు ప్రయత్నించిన వ్యక్తులను గుర్తించి వెంటనే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు..