ఎస్పీ అఖిల్ మహాజన్
బలగంటివీ ,సిరిసిల్ల:
రాజన్న సిరిసిల్ల జిల్లాలో గంజాయి ,మత్తు పధార్థాల నిర్ములనలో ప్రతి ఒక్కరు భాగస్వామ్యంమై గంజాయి రహిత జిల్లాగా మార్చాలని, గంజాయి మత్తు పదార్థాలకు సంబంధించిన సమాచారం ఉంటే మెసేజ్ యూవర్ ఎస్పీ నెంబర్ 630-392-2572 కు లేదా డయల్100 కి సమాచారం అందించాలనీ ఎస్పీ అఖిల్ మహాజన్ శుక్రవారం రోజున ఓ ప్రకటన లో తెలిపారు.ఈ సందర్బంగా ఎస్పీ అఖిల్ మహాజన్ మాట్లాడుతూ జిల్లాలో మత్తు పదార్థాల నిర్ములానే లక్ష్యంగా జిల్లా పోలీస్ శాఖ పని చేస్తుందని, ప్రభుత్వం నిషేధించిన గంజాయి,మరే ఇతర మత్తు పదార్థాల గురించి జిల్లా వ్యాప్తంగా స్పెషల్ డ్రైవ్ లు చేస్తున్నామని తెలిపారు.గంజాయి మత్తు పదార్థాలకు సంబంధించిన సమాచారం ఉంటే మెసేజ్ యూవర్ ఎస్పీ నెంబర్ 630-392-2572 కు లేదా డయల్100 కి సమాచారం అందించాలనీ అన్నారు. గంజాయి నిర్ములనలో ప్రతి ఒక్కరు భాగస్వామ్యం కావాలని సమాచారం అందించిన వారి వివరాలు గోప్యంగా ఉంచబడుతాయి అన్నారు. గడించిన నెల రోజుల కాలంలో జిల్లాలో గంజాయి కి సంబంధించి 05 కేసులు నమోదు చేసి 1.250 గ్రాముల గంజాయి సీజ్ చేసి,13 మందిని రిమాండ్ కి తరలించడం జరిగిందన్నారు.గంజాయి, మరే ఇతర మత్తు పదార్థాలు కలిగి ఉన్న,సేవించిన ,ఇతరులకు విక్రయించిన చట్ట ప్రకారం కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకుంటామని అన్నారు.
