గంభీరావుపేట :
అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో మంత్రి కేటీఆర్ తరపున బీఆర్ఎస్ పార్టీ నాయకులు, ప్రజాపతినిధులు మంగళవారం ఇంటింటా ప్రచారం నిర్వహించారు.గంభీరావుపేట మండలం కోళ్లమద్ది, శ్రీగాధ గ్రామాల్లో బీఆర్ఎస్ నాయకులు ఇంటింటింకీ తిరుగుతూ ప్రభుత్వ సంక్షేమ పథకాలు, బీఆర్ఎస్ మ్యానిఫెస్టోలోని అంశాలను ప్రజలకు వివరించారు. రాష్ట్రానికి సీఎం కేసీఆర్ పాలన శ్రీరామరక్ష అని అన్నారు. అభివృద్ధి నిరోధకులను దగ్గరికి రానివొద్దన్నారు. ప్రజా సంక్షేమ బీఆర్ఎస్ ప్రభుత్వం వైపే ప్రజలందరూ ఉన్నారన్నారు. వచ్చే ఎన్నికల్లో కారు గుర్తుకే ఓటు వేసి కేటీఆర్ ను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో సెస్ డైరెక్టర్ నారాయణరావు, బీ ఆర్ఎస్ మండల అధ్యక్షులు వెంకటస్వామి గౌడ్, ఆర్బిఎస్ కోఆర్డినేటర్ రాజేందర్, ఎంపిటిసి అంజిరెడ్డి నాయకులు లక్ష్మణ్, సురేందర్ రెడ్డి, రాజారాం, దయాకర్ రావు, రాజు,చెవుల మల్లేశం,శేఖర్ గౌడ్, వెంకట్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.