రామన్న రోడ్డు షో కి తరలిన పల్లెలు
కోహ్లీ సెంచరీ ల బిఆర్ఎస్ సెంచరీ కొడుతుంది – కేటీఆర్
వ్యవసాయ రంగంలో పంజాబ్ హర్యానా దాటిన తెలంగాణ
రాజన్న సిరిసిల్ల జిల్లాలో మంత్రి కేటీఆర్ పర్యటనలో భాగంగా తంగళ్ళపల్లి మండల కేంద్రంలో నిర్వహించిన రోడ్డు షో కి ఊరు ఊరు వాడ వాడల పల్లె జనాలు తరలివచ్చారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ సిరిసిల్ల జిల్లా అభివృద్ధి చెందిందని మరొక్కసారి అవకాశం ఇస్తే దేశానికే ఆదర్శంగా సిరిసిల్లను తీర్చిదిద్దుతానాని అన్నారు. కాంగ్రెస్ మొండి చెయ్యి ,చెవిలో పువ్వు బిజెపి మోసపూరిత మాటలను నమ్మవద్దన్నారు. కెసిఆర్ 18 సంవత్సరాలు నిండిన యువతులకు సౌభాగ్య లక్ష్మి పథకం ద్వారా 3000 రూపాయల పెన్షన్ ప్రవేశపెడతామని కెసిఆర్ నిర్ణయం చేశారని తెలిపారు. ప్రస్తుతం సిలిండర్ ధర 1100 రూపాయలు ఉన్నదని, 400 రూపాయలకే సిలిండర్ని పేద ప్రజలకు అందుబాటులోకి తీసుకొస్తామని తెలిపారు. మానేరు జలాశయం కాలేశ్వరం ప్రాజెక్టు ద్వారా వస్తున్న నీటితో మానేరు జలాశయం నిండుకుండలా ప్రవహిస్తుందని భూగర్భ జలాలు 6 1/2 ఫీట్లకు పెరిగాయని మానేరు వంతెన ప్రదేశంలో సిరిసిల్ల వాగు సముద్రంల తలపిస్తుందని జలషాయలు పెరిగి రైతులు పంటలు పండించిన పంట హర్యానా పంజాబ్ రాష్ట్రాలను అధిగమించామని అన్నారు. రేషన్ కార్డు కలిగిన ప్రతి కుటుంబానికి ఐదు లక్షల కేసీఆర్ బీమా పథకాన్ని ప్రవేశ పెట్టడం జరుగుతుందన్నారు. అసైన్డ్ భూములు కలిగిన దళితులకు గిరిజనులకు పూర్తి హక్కులు కల్పిస్తామని, కోహ్లీ సెంచరీ కొట్టినట్టు బిఆర్ఎస్ ప్రభుత్వం సెంచరీ కొట్టాలని దానికి అందరూ సహకరించి కారు గుర్తుకు ఓటు వేసి బిఆర్ఎస్ ప్రభుత్వాన్ని గెలిపించాలని కోరారు.