సిరిసిల్ల న్యూస్:
రాష్ట్ర స్థాయి వాలీబాల్ క్రీడోత్సవాలలో భాగంగా 67వ పాఠశాలల క్రీడా సమాఖ్య ఆధ్వర్యంలో మహబూబ్ నగర్ జిల్లా, రాజాపూర్ లో నిర్వహించిన వాలీబాల్ క్రీడోత్సవాలలో రాజన్న సిరిసిల్ల జిల్లాకు చెందిన వాలీబాల్ అకాడమీ క్రీడాకారుడు సృజన్ కుమార్ విజేతగా నిలిచి, తెలంగాణా రాష్ట్ర వాలీబాల్ జట్టు తరుపున జమ్మూ & కాశ్మీర్ రాష్ట్రంలోని, శ్రీనగర్ లో తేది: 31-10-2023 నుండి 04-11-2023 వరకు జరిగే జాతీయస్థాయి వాలీబాల్ పోటీలకు ఎంపికయ్యాడు. ఈ సందర్భంగా జిల్లా యువజన, క్రీడల శాఖ అధికారి అజ్మీర రాందాస్, ఎస్ జిఎఫ్ సెక్రెటరీ దేవత ప్రభాకర్ వాలీబాల్ క్రీడాకారుడు సృజన్ కుమార్ ను, అదేవిధంగా సృజన్ కుమార్ ఎంపికకు కృషి చేసిన అకాడమీ కోచ్ లు సంపత్ కుమార్, జగన్మోహన్ లను అభినందించారు.