బలగం టివీ: ఎల్లారెడ్డిపేట:
రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో టిపిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి ఆదేశాలకు కార్యకర్తల్లో నూతన ఉత్సాహం వచ్చిందని బుధవారం బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు దొమ్మాటి నరసయ్య స్థానిక విలేకరులకు తెలిపారు. ఈ సందర్భంగా పార్టీ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని పాత బస్టాండ్ లో రెండు నిమిషాలు ఆగి కార్యకర్తలతో మాట్లాడి సిరిసిల్ల వెళ్లడం జరిగిందన్నారు సిరిసిల్ల నియోజకవర్గం వైపు రాష్ట్రమంతా చూస్తుందని మీరు గెలిపించే కాంగ్రెస్ అభ్యర్థి కేకే మహేందర్రెడ్డి తెలంగాణ రాష్ట్రంలో చరిత్ర సృష్టించడం జరుగుతుందన్నారు. మీ గెలుపు రాష్ట్రానికి దిశ చూపుతుందని అన్నారు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు సద్ది లక్ష్మారెడ్డి రేవంత్ రెడ్డిని సన్మానించడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు గౌస్,పసుల కృష్ణ, మర్రి శ్రీనివాసరెడ్డి,లింగం గౌడ్, రాజనాయక్,సూడిద రాజేందర్, చెన్నబాబు,కొత్తపల్లి దేవయ్య, ఎండి సాహెబ్ పాల్గొన్నారు.