సిరిసిల్ల న్యూస్:
ఇంటిలో దొంగతనం చేసిన కేసులో ఇద్దరీకి 1 సంవస్సరం 1 నెల 15 రోజుల సాధారణ జైలు శిక్షతో పాటు 50 రూపాయల ఫైన్ విధిస్తూ సిరిసిల్ల ప్రథమశ్రేణి న్యాయమూర్తి ప్రవీణ్ మంగళవారం తీర్పు చెప్పారు.
ప్రాసిక్యూషన్ కథనం మేరకు.. 01సెప్టెంబర్ 2022 న సిరిసిల్లలోని సర్దార్ నగర్ కు చెందిన ఏనుగుల శరత్ కుమర్ తన ఇంటిలో దొంగతనం జరిగినదని ఇంటిలోని laptap చేవి కమ్మలు , ఉంగరాలు మొదలైన ఇతర వస్తువులు పోయినవి అని దొంగతనం చేసిన వ్యక్తిపై పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదు చేసాడు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దొంగతనం చేసిన అరుకాల@వడ్డేపల్లి సత్యం తండ్రి రాజయ్య,కులం:- పద్మశాలి, గాంధీనగర్ సిరసిల్ల మరియు దండుగుల లక్ష్మి భర్త పెద్దరాజాం కులం:- వడేర గాంధీనగర్ సిరిసిల్ల చెందిన యిద్దరు వ్యక్తులను అరెస్టు చేసి రిమాండ్ కి తరలించారు.విచారణ అనంతరం విచారణ అధికారి V. అనిల్ కుమార్ సి ఐ కోర్టులో చార్జిషీట్ దాఖలు చేసారు.
CMS SI లావుడ్య శ్రీకాంత్ గారి ఆధ్వర్యంలో కోర్టు కానిస్టేబుల్ వేముల నరేష్ గారి ద్యారా నిందితుడు నేరంను కోర్టులో అంగీకరించటంతో
కేసు పూర్వపరాలు పరిశీలించిన మేజిస్ట్రేట్ నిందితుడికి 1 సంవసరం 1 నెల 15 రోజులు జైలు శిక్ష విధించారని టౌన్ ఇన్స్పెక్టర్ ఉపేందర్ ఒక ప్రకటనలో తెల్పారు.