ఎల్లారెడ్డిపేటలో లగిశెట్టి శ్రీనివాస్ పార్టీ కార్యాలయం ఏర్పాటు
పద్మశాలి ముద్దుబిడ్డ, సామాజిక సేవకులు
యువకులకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తా..!
బలగం టివీ:
ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో సిరిసిల్ల నియోజకవర్గపు స్వతంత్ర అభ్యర్థి పద్మశాలి ముద్దుబిడ్డ, సామాజిక సేవకులు లగిశెట్టి శ్రీనివాస్ ఎల్లారెడ్డిపేట కొత్త బస్టాండ్ పరిధిలో తమ కార్యాలయాన్ని ప్రారంభించారు. అనంతరం ఎల్లారెడ్డిపేటలో ప్రతి గడపకు భారీ సంఖ్యలో మహిళలు,యువకులతో ప్రచారాన్ని కొనసాగించారు. లలిశెట్టి శ్రీనివాస్ మాట్లాడుతూ.. తను సిరిసిల్ల నివాసిని అని పేద ప్రజలకు ఎలాంటి ఆపద వచ్చినా ముందుంటానని,అధికార పార్టీ ఇప్పటివరకు నిరుపేదలకు కనీసం డబుల్ బెడ్ రూములు,సంక్షేమ పథకాలు అందలేదని,తనను గెలిపిస్తే ఇల్లు లేని నిరుపేదలకు ఇండ్లు,త్రాగడానికి స్వచ్ఛమైన నీరు,యువతకు ఉద్యోగ అవకాశాలు,కులవృత్తుల వారిని ప్రోత్సహించి వారు ఆర్థికంగా ఎదగడానికి కృషి చేస్తామని తెలిపారు.