పారదర్శక, నిష్పక్షపాత ఎన్నికల నిర్వహణకు ఫ్లాగ్ మార్చ్- సిరిసిల్ల టౌన్ సి.ఐ ఉపేంద

0
357

సిరిసిల్ల న్యూస్:
జిల్లాలో శాంతియుత వాతావరణంలో ఎన్నికలను నిర్వహించడానికి జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఆదేశాల మేరకు సిరిసిల్ల పట్టణ కేంద్రంలో బిఎస్ఎఫ్, జిల్లా పోలీసు సిబ్బందితో ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు. ఈ సందర్భంగా సిరిసిల్ల టౌన్ సి.ఐ ఉపేందర్ మాట్లాడుతూ రానున్న ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో, నిష్పక్షపాతంగా నిర్వహించేందుకు ప్రజలందరికి పోలీసులు ఎల్లవేళలా తోడుంటారని, ప్రజలకు ధైర్యాన్ని కల్పించడానికి జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు సిరిసిల్ల పట్టణంలోని నేతన్న చౌక్ వద్ద నుండి పెద్దబజార్, రాళ్ళ బావి, శాంతి నగర్, సిధార్థ నగర్, అంబేద్కర్ నగర్, విద్యానగర్, గీత నగర్, పోలీస్ స్టేషన్ వరకు బిఎస్ఎఫ్ బలగాలు, జిల్లా పోలీసు సిబ్బందితో ఫ్లాగ్ మార్చ్ నిర్వహించడం జరిగిందన్నారు. ఎటువంటి ఇబ్బందులు లేకుండా ధైర్యంగా ఓటు హక్కును వినియోగించుకోవాలని ప్రజలకు సూచించారు. ఈ ఎన్నికలను శాంతియుత వాతావరణంలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా నిర్వహించడమే లక్ష్యంగా ఈ ఫ్లాగ్ మార్చ్ లు అన్ని ప్రాంతాలలో నిర్వహించడం జరుగుతుందని, ఎన్నికల సమయంలో కేంద్ర బలగాలు కీలకపాత్రను పోషిస్తాయని, ప్రతి క్రిటికల్ పోలింగ్ కేంద్రాల నందు సాయుద బలగాలతో కూడిన బిఎస్ఎఫ్ సిబ్బంది విధులను నిర్వహిస్తుంటారని తెలిపారు. ఈ ఫ్లాగ్ మార్చ్ లో ట్రాఫిక్ ఎస్.ఐ రాజు, పోలీస్ సిబ్బంది, బిఎస్ఎఫ్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here