అత్యవసర సేవల్లో పనిచేస్తున్న జిల్లా సిబ్బంది కలెక్టర్ అనురాగ్ జయంతి విజ్ఞప్తి
సిరిసిల్ల న్యూస్:
అత్యవసర సేవలో పనిచేస్తున్న సిబ్బంది
పోస్టల్ బ్యాలెట్ కోసం అవకాశం కలిగి ఉండి, దానిని వినియోగించదల్చిన వారు నవంబర్ 7 వ తేదీ లోపు నిర్ణీత ఫారం-12(డి) భర్తీ చేసి సంబంధిత నియోజకవర్గాల రిటర్నింగ్ అధికారులకు అందజేయాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ అనురాగ్ జయంతి సూచించారు.
ఈ మేరకు ఆయన శనివారం ఒక ప్రకటన విడుదల చేశారు.
అత్యవసర సర్వీసులకు చెందిన వారికి ఎన్నికల సంఘం పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు హక్కు వినియోగించుకునే అవకాశం కల్పించిందని అన్నారు. ఎన్నికల సంఘం ద్వారా మీడియా పాసులు కలిగిన జర్నలిస్టులకు కూడా ఈసారి ఎన్నికల్లో పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు హక్కు వినియోగించుకునేందుకు ఎలక్షన్ కమిషన్ అనుమతించిందని తెలిపారు.

అయితే పోలింగ్ రోజున పోలింగ్ కేంద్రాలకు వెళ్లి ఓటు వేసేందుకు వీలుపడని వారు పోస్టల్ బ్యాలెట్ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు.
నవంబర్ 7 వ తేదీ లోపు రిటర్నింగ్ అధికారుల కార్యాలయాల్లో సమర్పించే ఫారం -12 (డీ)లను మాత్రమే పరిగణలోకి తీసుకుని పోస్టల్ బ్యాలెట్ కు అవకాశం కల్పిస్తామని స్పష్టం చేశారు.
ఫారం -12 (డీ) దరఖాస్తులు నోడల్ అధికారి నుండి, రిటర్నింగ్ అధికారుల కార్యాలయాల నుండి పొందవచ్చని, సంబంధిత నోడల్ అధికారుల నుండి,ఎన్నికల సంఘం పోర్టల్ నుండి కూడా డౌన్ లోడ్ చేసుకోవచ్చని సూచించారు.
దరఖాస్తు చేసుకున్న వారు సంబంధిత ఆర్.ఓ కార్యాలయానికి వెళ్లి పోస్టల్ బ్యాలెట్ ఓటు వేయాల్సి ఉంటుందన్నారు.
ఈ మేరకు రిటర్నింగ్ అధికారి కార్యాలయంలో ప్రత్యేకంగా పోస్టల్ ఓటింగ్ సెంటర్ (పీవీసీ) అందుబాటులో ఉంటుందని తెలిపారు. ఒకసారి పోస్టల్ బ్యాలెట్ కోసం నిర్ణీత ఫారం ద్వారా దరఖాస్తు చేసుకున్న వారికి ఎట్టి పరిస్థితుల్లోనూ పోలింగ్ రోజున పోలింగ్ కేంద్రానికి వెళ్లి ఓటు వేసే అవకాశం ఇవ్వరని, ఓటరు జాబితాలో వారి పేరును పోస్టల్ బ్యాలెట్ కింద మార్కింగ్ చేయబడుతుందని కలెక్టర్ స్పష్టం చేశారు.
అత్యవసర సేవలో పనిచేస్తున్న సిబ్బంది వీరే!
అత్యవసర సేవలో పనిచేస్తున్న సిబ్బంది
కోసం ప్రత్యేకంగా నోటిఫికేషన్ కింద పోస్టల్ బ్యాలెట్ సౌకర్యం కల్పించబడింది… ఈ కేటగిరీలలో పనిచేస్తున్న సిబ్బంది ఎన్నికల రోజున విధులలో ఉండాల్సిన అవసరం ఉంటుంది అవి ఏవంటే వైద్య ఆరోగ్యశాఖ కింద వైద్యరంగంలో, ఏరియా హాస్పిటల్స్ లో పీహెచ్ సి లలో…etc పనిచేస్తున్న వారు.
అగ్నిమాపక శాఖ కింద పనిచేస్తున్న సిబ్బంది..
రోడ్డు రవాణా సంస్థలో పనిచేస్తున్న సిబ్బంది డ్రైవర్లు ,కండక్టర్లు, క్లీనర్లు..
ఎన్నికల సంఘం చేత అనుమతించబడిన పాత్రికేయులు..
ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా/ పౌరసరఫరాల సంస్థల గిడ్డంగులలో పనిచేసే సిబ్బంది..
విద్యుత్ శాఖలో, సెస్ లో పనిచేస్తున్న సిబ్బంది, ఎయిర్పోర్ట్ అథారిటీ, దూరదర్శన్, ఆల్ ఇండియా రేడియో, ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో, బిఎస్ఎన్ఎల్ మొదలైన సంస్థల్లో పనిచేసేటువంటి సిబ్బందికి ఆబ్సెంట్ ఓటర్స్ కింద ఎన్నికల సంఘం నిర్ధారించినది.

వారు పోలింగ్ రోజున విధుల్లో ఉండే అవకాశం ఉంటుంది, కాబట్టి వారికి పోస్టల్ ఓటింగ్ సెంటర్ ఏర్పాటు చేయడం జరుగుతుంది. కావున ఆసక్తి కలిగిన వారు అన్ని రిటర్నింగ్ ఆఫీసర్ కార్యాలయాలు, జిల్లా సంక్షేమ అధికారి కార్యాలయంలోనూ, జిల్లా ప్రజా సంబంధాల అధికారి కార్యాలయంలోనూ , అలాగే సంబంధిత శాఖల జిల్లా అధిపతుల దగ్గర ఉంటుంది. అలాగే జిల్లా వెబ్సైట్లో కూడా అప్లోడ్ చేయడం జరిగింది.. దానిని తీసుకొని వారు దరఖాస్తు చేసుకున్నట్లయితే వారికోసం పోస్టల్ ఓటింగ్ సెంటర్లో ఓటు వేయడానికి ముందుగానే అనుమతించబడుతుంది…
అక్రిడేటేడ్ జర్నలిస్ట్ లు పోస్టల్ బ్యాలెట్ ఫారాలు dpro కార్యాలయంలో పొందవచ్చు
ఎన్నికల సంఘం చేత ద్వారా పాస్ లు జారీ చేయబడిన అక్రిడేటేడ్ పాత్రికేయులు పోస్టల్ బ్యాలెట్ వినియోగించుకోవాలని భావిస్తే.. పోస్టల్ బ్యాలెట్ పార్టు 12డీ ఫారం సిరిసిల్ల సమీకృత జిల్లా కార్యాలయ సముదాయంలోని జిల్లా పౌర సంబంధాల అధికారి కార్యాలయం లో కార్యాలయ పని.వేళల్లో సంప్రదించవచ్చు.
అత్యవసర సేవలో పనిచేస్తున్న సిబ్బంది పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు హక్కువినియోగం ఎక్కడంటే…
అత్యవసర సేవలో పనిచేస్తున్న సిబ్బంది
ఆర్డీవో ( రిటర్నింగ్ అధికారి) కార్యాలయంలో
పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు హక్కు వినియోగించుకోవచ్చు.
మూడు రోజులపాటు దీనికోసం ప్రత్యేకంగా ఒక పోలింగ్ కేంద్రం ఆర్డీవో కార్యాలయంలో తెరిచిపెట్టబడుతుంది.
ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఇట్టి పోలింగ్ స్టేషన్ ఓపెన్ చేసి పెట్టబడుతుంది.
పోలింగ్ స్టేషన్ ఓపెన్ చేయబోయే మూడు రోజుల వివరాలను అన్ని పత్రికల ద్వారా,HOD ల ద్వారా, వీలును బట్టి ఎస్ఎంఎస్ ద్వారా అత్యవసర సేవలో పనిచేస్తున్న సిబ్బందిలో పోస్టల్ బ్యాలెట్ కోసం నమోదు చేసుకున్న సిబ్బందికి
తెలియజేయడం జరుగుతుంది.
సందేహాలు ఉంటే DWO ను సంప్రదించండి
అత్యవసర సేవలో పనిచేస్తున్న సిబ్బంది
పోస్టల్ బ్యాలెట్ ఫారం పొందడంలో, వినియోగించుకోవడంలో ఏమైనా సందేహాలు ఉంటే జిల్లా సంక్షేమ అధికారి, జిల్లా పోస్టల్ బ్యాలెట్ నోడల్ అధికారి లక్షిరాజంను మొబైల్ నెంబర్ 9490031615 లో
సంప్రదించాలని జిల్లా కలెక్టర్ తెలిపారు.