సిరిసిల్ల న్యూస్:
రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినిపల్లి మండలం అనంతపల్లి, గుండన్నపల్లి గ్రామాల్లో మంగళవారం రోజున బి.ఆర్.ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు జోగినిపల్లి రవీందర్ రావు, ముదుగంటి సురేందర్ రెడ్డి, చెన్నాడి అమిత్ రావు ఆధ్వర్యంలో బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి చొప్పదండి ఎమ్మెల్యే అభ్యర్థి సుంకె రవిశంకర్ గెలుపు కోసం పార్టీ శ్రేణులతో కలిసి క్షేత్రస్థాయిలో ఎన్నికల ప్రచారంలో భాగంగా గ్రామాలలో గడపగడప వెల్లి, బిఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించి, కారు గుర్తుపై ఓటు వేయాలని, మూడోసారి ముఖ్యమంత్రిగా కెసిఆర్ ను,చొప్పదండి నియోజకవర్గ రెండవసారి ఎమ్మెల్యేగా సుంకె రవిశంకర్ ను భారీ మెజార్టీతో గెలిపించాలని ప్రజల్ని కోరారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ పర్లపల్లి వేణుగోపాల్, వైస్ ఎంపీపీ కొనుకటి నాగయ్య, సెస్ డైరెక్టర్ కొట్టేపల్లి సుధాకర్, స్థానిక సర్పంచులు, వివిధ గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు, బి.ఆర్.ఎస్ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు, పాల్గొన్నారు.