సిరిసిల్ల న్యూస్:
మేకలను దొంగతనం చేసినందుకు ఇద్దరు వ్యక్తులను పోలీసులు రిమాండ్ చేశారు. ఎల్లారెడ్దిపేట ఎస్ఐ రమాకాంత్ తెలిపిన వివరాల ప్రకారం గుండారం గ్రామానికి చేందిన లాల ఎల్లయ్య ఈ నెల 10న తన పాకలో ఎప్పటి లాగానే మేకలను కట్టేసి ఇంటికి వెళ్ళాడు మరుసటి రోజు వచ్చి చూడగా రెండు మేకలు కనబడక పోవడం తో పోలీస్ స్టేషన్ కు వచ్చి పిర్యాదు చేయగా కేసు నమోదు చేసి ధర్యాప్తు చేయగా కామారెడ్డి జిల్లా మాచారెడ్డి మండలం లచ్చపేట గ్రామానికి చెందిన ముజాకర్ ప్రశాంత్, చల్ల నవీన్ లను గుర్తించి విచారణ చేయగా మేకలను ఎత్తుకేళ్ళింది నిజమేనని ఒప్పుకోవడం తో వారిపై కేసు నమోదు చేయగా కోర్టు ఇద్దరు నిందుతులకు రిమాండ్ విధించి జైలుకు పంపారాని ఎస్ఐ పేర్కొన్నారు.