సిరిసిల్ల న్యూస్:
కలం స్నేహం సాహితీ సాంస్కృతిక సంస్థ ఆధ్వర్యంలో యాదాద్రిలో నిర్వహించిన రాష్ట్ర స్థాయి శతాధిక కవి సమ్మేళనంలో సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం భీముని మల్లారెడ్డిపేటకు చెందిన కవయిత్రి ఆకుల రాజ్యలక్ష్మి యాదాద్రి పాశస్త్రంపై కవితలు రాసి వినిపించారు.రాజ్య లక్ష్మి నీ సంస్థ వ్యవస్థాపక అధ్యక్షుడు ప్రముఖ సంగీత దర్శకుడు, సినీ గేయ రచయిత గోపాల ఆచార్య శాలువా, జ్ఞాపక ప్రశంసా పత్రాలతో ఘనంగా సన్మానించారు.. ఈ కార్యక్రమంలో వివిధ జిల్లాల నుంచి కవయిత్రులు పాల్గొన్నారు.