సిరిసిల్ల న్యూస్:
లక్ష మెజారిటీతో ఎమ్మెల్యే అభ్యర్థిగా కేటీఆర్ ను గెలిపించుకోవడమే లక్ష్యం అని జడ్పిటిసి చీటీ లక్ష్మణ్ రావు అన్నారు. ఎల్లారెడ్డిపేట మండలంలో సోమవారం వివిధ గ్రామాలలో ప్రచారం చేస్తూ ప్రగతి ప్రధాన తెలంగాణ అని అత్యధిక మెజారిటీతో కేటీఆర్ ను గెలిపించుకోవడం అదేవిధంగా ముచ్చటగా మూడోసారి రాష్ట్ర ముఖ్యమంత్రిగా కేసీఆర్ ను ఎన్నుకోవడం కొరకు తెలంగాణ ప్రజలు ఆకాంక్షిస్తూ ఈ ఎన్నికలలో పాల్గొంటున్నారని పేర్కొన్నారు. బీఆర్ఎస్ పార్టీ గెలుపే లక్ష్యంగా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. ప్రతి ఇంటికి ప్రతి గడపగడపకు వెళ్లి ప్రభుత్వ సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు వివరించాలని మండల బీఆర్ఎస్ నాయకులకు సూచించారు. బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి రావడం ఖాయమని అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తున్న ప్రభుత్వాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రజలు తమ ఓటును కారు గుర్తుపై వేసి బంగారు తెలంగాణలో భాగస్వాములు అవుతారని అన్నారు.