సిరిసిల్ల న్యూస్:
జర్మనీ దేశానికి సంబంధించిన జిఎస్ఈ సంస్థ చైర్మన్ తామస్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న స్టడీ టూర్ లో భాగంగా జర్మనీ దేశస్తులు సిరిసిల్ల పట్టణం ను సందర్శించారు. ఈ సందర్భంగా జర్మనీ దేశస్తులను మున్సిపల్ చైర్ పర్సన్ జిందం కళ చక్రపాణి ఇంటికి ఆహ్వానించి తెలంగాణ సాంప్రదాయం పిండివంటలతో కూడిన తేనేటి విందును ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా జిఎస్ఈ సంస్థ చైర్మన్ తామస్ మాట్లాడుతూ వారి బృందంతో ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి సిరిసిల్లలో పర్యటిస్తున్నామని, దాదాపు ఈ 10 సంవత్సరాలలో సిరిసిల్ల చాలా అభివృద్ధి చెందిందని తక్కువ సమయంలో ఇంత అభివృద్ధి సాధించడం గొప్ప విషయమని, సిరిసిల్లలో పర్యటిస్తున్నందుకు మేము చాలా సంతోషిస్తున్నామని అన్నారు. జిందం కళ చక్రపాణి మాట్లాడుతూ తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంలో ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు నాయకత్వంలో ప్రజా సంక్షేమమే అభివృద్ధి ధ్యేయంగా రాజన్న సిరిసిల్ల జిల్లాను ఒక ఆదర్శవంతమైన జిల్లాగా తీర్చిదిద్దారని అన్నారు. పండగ రోజున ఇంటికి వచ్చిన అతిథులను గౌరవించుకోవడం సాంప్రదాయంలో భాగమని, బతుకమ్మ దసరా పండగల గొప్పతనాన్ని వారికి తెలియజేస్తూ తెలంగాణ సాంప్రదాయ వంటకాలను వారికి అందించారు. వీరి వెంట బి వై నగర్ చర్చి ఫాదర్ బ్రదర్ శ్యామ్ కల్వాల్, బిఆర్ఎస్ పార్టీ సిరిసిల్ల శాఖ అధ్యక్షులు జిందం చక్రపాణి, జర్మనీ దేశస్తులు ఉన్నారు.