కాంగ్రెస్ బిజెపి రెండు ఒకటే…
సిరిసిల్ల ప్రజలను కంటికి రెప్పలా కాపాడుకుంటా..
బండి సంజయ్ కరీంనగర్ లోని గుడికి,బడికి ఒక పైస తేలే..
ప్రజల తరఫున పోరాడడంలో కేసీఆర్ దేశంలోనే నెంబర్ వన్..
బలగం టివి, రాజన్న సిరిసిల్ల:
బీఆర్ఎస్ ను రేవంత్ రెడ్డి వంద మీటర్ల బొంద పెడతా అని అంటున్నారని, సీఎం రేవంత్ రెడ్డికి ఒకటే చెబుతున్నా నీకంటే నీ గురువులు, తీస్మార్ఖాన్లు కెసిఆర్ ను,గులాబి జెండాను బొంద పెడతామన్నారు, వారితోనే కాలే నీలాంటి బుడ్డరా ఖాన్ తోనీ ఏమి అవుతది, ఏమీ కాదు అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ అన్నారు. ఆదివారం సిరిసిల్ల పట్టణంలో సిరిసిల్ల నియోజకవర్గ కార్యకర్తల సమావేశానికి ముఖ్యఅతిథిగా కేటీఆర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ

సిరిసిల్ల ప్రజలను కంటికి రెప్పలా కాపాడుకుంటానని, రాజకీయాల్లో ఉన్నంతసేపు సిరిసిల్ల నియోజకవర్గాన్ని వదిలిపెట్టే సమస్య లేదని, ఎవరెవరో ఏమేమో రాస్తారని అవి పట్టించుకోవద్దని అన్నారు.
14 ఏళ్లు ఉద్యమంలో, 10 సంవత్సరాల ప్రభుత్వంలో కారు జోరుగా నడిచిందని, ఇప్పుడు చిన్న స్పీడ్ బ్రేకర్ వచ్చిందని అన్నారు. కారు పని అయిపోయిందని అంటున్నారని, కారు సర్వీసింగ్ కి వెళ్లిందని, తిరిగి 100 స్పీడుతో మరోసారి అధికారంలోకి వస్తుందని అన్నారు. ప్రజలను మనల్ని తీసిపారేయలేదని, 39 స్థానాలు గెలిపించారని, 14 స్థానాలు స్వల్ప తేడాతో ఓడిపోయామని అన్నారు. కాంగ్రెస్ అమలు కానీ హామీలను ఇచ్చిందని, వాటిని అమలు చేయకుండా దాటి వేసే ప్రయత్నం చేస్తుందని అన్నారు. 6 గ్యారెంటీలలో 13 హామీలు ఉన్నాయని, ఒక మహాలక్ష్మి కిందనే మూడు హామీలను ఉన్నాయని, వాటిలో ఒకటి బస్సు ఉచిత ప్రయాణం అమలు చేశారని, 2500, 500 కే గ్యాస్ సిలిండర్ ఇంకా అమలు చేయలేదని అన్నారు. గత ప్రభుత్వంలో చేసిన పనులలో అవినీతి ఉంటే, అధికారం ఉంది కదా ఎంక్వయిరీ చేయాలని, వెనుకకు పోయే సమస్య లేదు అని అన్నారు. అమలు కానీ హామీలు ఇచ్చి, అధికారంలోకి వచ్చారని, ప్రజల తరఫున ప్రజల నుంచి వచ్చిన సీఎం రేవంత్ రెడ్డి కాదు అని, ఢిల్లీలో మేనేజ్మెంట్ చేసి, మేనేజ్మెంట్ కోటాలో సీఎం అయిన వ్యక్తి రేవంత్ రెడ్డి అని అన్నారు. బిజెపి కాంగ్రెస్ రెండు ఒకటేనని, బీజేపీ అభ్యర్థులను గెలిపించడం కోసం బిజెపితో లోపాయకారి ఒప్పందం కాంగ్రెస్ చేసుకొందని, అసెంబ్లీ ఎన్నికల్లో బిజెపి అభ్యర్థులు గెలిచిన చోట కాంగ్రెస్ డమ్మీ అభ్యర్థుల నిలబెట్టిందని అన్నారు. మాజీ ఎంపీ వినోద్, ప్రస్తుత ఎంపీ బండి సంజయ్ పనితీరు ఎట్లా ఉందో ప్రజలు ఆలోచన చేయాలని అన్నారు. బండి సంజయ్ కరీంనగర్ పార్లమెంట్ లోని ఏ గుడి అభివృద్ధికి నయా పైసా తీసుకురాలేదు అని, ఒక బడి కూడా తెలీదు అని అన్నారు. గత ప్రభుత్వంలో పలు అభివృద్ధి కార్యక్రమాలను ఆహ్వానించిన ఎంపీ బండి సంజయ్ పాల్గొలేదని, గెలిచిన తర్వాత నియోజకవర్గాల్లోని ఏ మండలం గ్రామాల ముఖాన చూసిన పాపాన పోలేదని అన్నారు. బండి సంజయ్ కేసిఆర్ ను తిట్టడం, అమిత్ షా చెప్పులు మోయడం తప్ప ఏమీ చేయలేదని అన్నారు. ప్రజా ప్రతినిధి గా ఉన్నప్పుడు ప్రజల సమస్యలపై పోరాడాలి కానీ, ధర్మం కోసం పనిచేస్తే కాశి కో గయా పోయి పీఠం ఏర్పరుచుకోవాలని అన్నారు. నేత కార్మికులను కాంగ్రెస్ నాయకులు బెదిరిస్తున్నారని, వారికి ఆర్డర్ ఇవ్వకుండా అడ్డుకుంటున్నారని, నేత కార్మికుల కోసం 39 మంది ఎమ్మెల్యేలతో ప్రభుత్వాన్ని అష్టదిగ్బంధనం చేస్తామని, కొట్లాడం బి ఆర్ ఎస్ కు కొత్త కాదు అని అన్నారు. ప్రజల పక్షాన పోరాడడంలో దేశంలోని కెసిఆర్ నెంబర్ వన్ అని అన్నారు. కరీంనగర్ ఎంపీగా బన్ వినోద్ కుమార్ ను గెలిపించాలని, కాంగ్రెస్ బిజెపి అసత్య ప్రచారాలను ప్రజలకు వివరించాలని అన్నారు.