బలగం టివి,
40,000/-రూపాయలు, రెండు సెల్ ఫోన్స్ స్వాధీనం.
గంభీరావుపేట్ పోలీస్ స్టేషన్ లో అంతర్ జిల్లా దొంగల అరెస్ట్ వివరాలు వెల్లడించిన ఎల్లారెడ్డిపేట్ సి.ఐ శశిధర్ రెడ్డి.
నిందుతుల వివరాలు.
1.వుడెం అరుణ్ కుమార్ గ్రామం నారాయణపూర్,కామారెడ్డి జిల్లా.2.బోడమీది రవి ,గ్రామం ఆర్మూర్,3.గాయిని మైసయ్య, గ్రామం గాంధారి,4.గులుసు లింగం,గ్రామం గాంధారి.5.కలీం అహ్మద్,కామారెడ్డి.
ఈ సందర్భంగా సి.ఐ శశిధర్ మాట్లాడుతూ….
తేదీ:16-12-2023 రోజున గంభీరావుపేట్ మండల పరిధిలోని ముస్తఫా నగర్ ,దమ్మన్నపేట గ్రామాలలో ఉన్న ఐడియా, బిఎస్ఎన్ఎల్ సెల్ టవర్స్ లోని బ్యాటరీలు దొంగలించబడినవని గంభీరావుపేట్ పోలీస్ స్టేషన్ లో ఐడియా లో పని చేసే కిరణ్,బిఎస్ఎన్ఎల్ పని చేసే మూతయ్య ల పిర్యాదు నమోదు కాకా అట్టి పిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తులో భాగంగా నమ్మదగిన సమాచారం మేరకు ఈరోజు మధ్యాహ్నం 10:00 గంటలకు పెద్దమ్మ స్టేజి ప్రాంతంలో వుడెం అరుణ్ కుమార్,బోడమీది రవి,,గాయిని మైసయ్య, గులుసు లింగం లను అరెస్టు చేసి వారిని విచారించగా నారాయణపూర్ గ్రామానికి చెందిన అరుణ్ కుమార్ గతంలో బిఎస్ఎన్ఎల్ కంపెనీలో సూపర్వైజర్ గా పనిచేసినడని అతను మిగతా నిందితులను కలుపుకొని ఒక ముఠాగా ఏర్పడి దొంగతనానికి పాల్పడినారని తెలిపినారు.వారు దొంగలించిన సొమ్మని కామారెడ్డి గ్రామానికి చెందిన కలీం అహ్మద్ కి అమ్మినారని తెలుపగా కలీం అహ్మద్ ని అరెస్టు చేసి వారి దగ్గరినుండి 40,000/- రూపాయల నగదు రెండు సెల్ఫోన్ లను స్వాధీనపరచుకొని రిమాండ్ కి తరలించడం జరిగింది.పై నిందితులు గతంలో బాన్సువాడ పోలీస్ స్టేషన్ పరిధిలో దొంగతనానికి పాల్పడగా అట్టి దొంగతనానికి సంబంధించి 1,50,000/- రూపాయల నగదు మరియు 72 బ్యాటరీలను, ఇట్టి దొంగతనానికి ఉపయోగించిన కారు మరియు ఒక టాటా ఎస్ ఆటో ని పోలీసు వారు స్వాధీన పరచుకున్నారని , వీరు కామారెడ్డి జిల్లాలో దాదాపు పది కేసులలో నిందితులుగా అరెస్టు చేయబడి దొంగతనాలను ఒప్పుకున్నారని మరియు గాంధారి గ్రామానికి చెందిన మరొక నేరస్తుడు మ్యాతరి సాయిలు పరారీలో ఉన్నాడని సాయిలు త్వరలో పట్టుకోవడం జరుగుతుందని ఎల్లారెడ్డిపేట సిఐ శశిధర్ రెడ్డి గారు తెలిపారు.
ఈ మీడియా సమావేశంలో గంభీరావుపేట ఎస్సై బి రామ్మోహన్,సిబ్బంది ఉన్నారు.