బలగం టివి, తంగళ్ళపల్లి
విద్యార్థులకు స్టడీ అవర్ లో స్నాక్స్ కోసం 5000 వేల రూపాయలు అందజేత..
తంగళ్ళపల్లి జిల్లా పరిషత్ ప్రభుత్వ పాఠశాల పదవ తరగతి విద్యార్థులకు స్టడీ అవర్లో స్నాక్స్ కోసం (5000) ఐదు వేల రూపాయలను పాఠశాల ప్రధానోపాధ్యాయులు శంకర్ నారాయణ కు అందజేసిన మాజీ జెడ్పిటిసి కోడి అంతయ్య..
ఈ సందర్భంగా విద్యార్థులు కష్టపడి ఉన్నత స్థాయికి రావాలని అంతయ్య వెల్లడి..
పాఠశాలలో ఏమైనా సమస్యలు ఉంటే ఎమ్మెల్యే కేటీఆర్ దృష్టికి తీసుకువెళ్లి పరిష్కారానికి కృషి చేస్తానని పేర్కొన్న మాజీ జెడ్పిటిసి..
పాఠశాల అభివృద్ధికి తన వంతు సాయం అందిస్తానని ప్రకటన…
స్టడీ అవర్ లో విద్యార్థుల స్నాక్స్ కోసం సాయం అందించిన అంతయ్యకు కృతజ్ఞతలు తెలిపిన ఉపాధ్యాయులు,విద్యార్థులు…
కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు శంకర్ నారాయణ,మాజీ వార్డ్ మెంబర్ చందు, ఉపాధ్యాయులు,విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.