బలగం టివి,,ఎల్లారెడ్డిపేట
రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట కొత్త బస్టాండ్ సమీపంలో 2016 రోజున జరిగిన రోడ్డు ప్రమాదంలో మండల కేంద్రానికి చెందిన ఓ యువకుడు రోడ్డు ప్రమాదంలో తీవ్ర గాయాలై మృతి చెందగా ప్రమాదానికి కారకుడైన లారీ డ్రైవర్ కు ఒక సంవత్సరం జైలు శిక్షతో పాటు 1200 రూపాయల జరిమానా న్యాయస్థానం విధించిందని ఎల్లారెడ్డిపేట ఎస్సై రమాకాంత్ తెలిపారు.2016 లో ఎల్లారెడ్డిపేట కు చెందిన చెందిన ఎండి ఆసిఫ్, దాయి భాస్కర్(26) అనే ఇద్దరు యువకులు ఎల్లారెడ్డిపేట కొత్త బస్టాండ్ సమీపంలో జవాజి ఆనందరావు అనే లారీ డ్రైవర్ అతివేగంగా అజాగ్రత్తగా నడుపుకుంటూ వచ్చి వెనుక నుండి టక్కరి ఇవ్వగా వెనుక కూర్చున్న దాయి భాస్కర్ కు తీవ్ర గాయాలై చికిత్స పొందుతూ చనిపోయాడు. ఎండి ఆనిఫ్ అనే వ్యక్తి పోలీసులకు దరఖాస్తు ఇవ్వగా కేసు నమోదు చేసుకొని దర్యాప్తులో భాగంగా గౌరవ సిరిసిల్ల కోర్టు న్యాయ విచారణ జరిపి, నేరం రుజువైనందున సోమవారం రోజు నేరస్తుడైన (డ్రైవర్) జవాజి ఆనందరావు అను అతనికి కోర్టు వారు ఒక సంవత్సరం జైలు శిక్షతోపాటు 1200 రూపాయలు జరిమానా విధించి కరీంనగర్ జైలుకు తరలించడం జరిగిందని ఎస్ఐ తెలిపినారు.