ఇంటర్మీడియట్ పరీక్షల సందర్భంగా పరీక్షా కేంద్రాల వద్ద 163 BNSS (సెక్షన్ 144) అమలు

0
49

బలగం టీవీ, రాజన్న సిరిసిల్ల:

ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షల నిర్వహణ నేపథ్యంలో సిరిసిల్ల సబ్ డివిజన్ పరిధిలో ఏర్పాటు చేసిన 10 పరీక్షా కేంద్రాల వద్ద తేది: 25-02-2026 నుండి 18-03-2026 వరకు ప్రతిరోజు ఉదయం 09:00 గంటల నుండి మధ్యాహ్నం 12:00 గంటల వరకు 163 BNSS (సెక్షన్ 144) అమల్లో ఉంటుందని సిరిసిల్ల డిఎస్పీ నాగేంద్రచారి తెలిపారు.

జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు పరీక్షలు ప్రశాంత వాతావరణంలో పరీక్షలు జరిగేలా భద్రతా ఏర్పాట్లు చేపట్టినట్లు తెలిపారు. పరీక్షా కేంద్రాల వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయడం జరుగుతుందని పేర్కొన్నారు.

అమలులో ఉండే నిబంధనలు.. ఇద్దరు లేదా అంతకంటే ఎక్కువ మంది వ్యక్తులు పరీక్షా కేంద్రాల వద్ద గుమికూడరాదు. నిషేధిత వస్తువులతో పరీక్షా కేంద్రాల వద్ద సంచరించరాదు. పరీక్షా కేంద్రం నుండి 200 మీటర్ల పరిధిలో ఉన్న జిరాక్స్ సెంటర్లు ఉదయం 08:00 గంటల నుండి మధ్యాహ్నం 01:00 గంటల వరకు మూసివేయాలి.

పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు, తల్లిదండ్రులు మరియు ప్రజలు పోలీస్ శాఖకు సహకరించి నిబంధనలు పాటించాలని విజ్ఞప్తి చేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here