17 వ బెటాలియన్​ కవాతు

0
258

17వ పోలీస్ బెటాలియన్ వార్షిక తనిఖీలో భాగంగా వచ్చిన డీ.ఐ.జీ సిద్ధిఖీ, టి.ఎస్.ఎస్.పి బెటాలియన్స్ గారు బెటాలియన్ సిబ్బంది ప్రదర్శించిన కవాతును పరిశీలించి గౌరవవందనం స్వీకరించారు.

ఈ సందర్భంగా కమాండెంట్ శ్రీ యస్.శ్రీనివాస రావు గారు మాట్లాడుతూ బెటాలియన్ లో నూతనంగా గ్రీవెన్స్ సెల్ ఏర్పాటు చేశామని సిబ్బందికి సంబంధించిన ఏవైనా సమస్యలు ఉంటే ఏ రోజు సమస్య అదే రోజున పరిష్కరిస్తున్నామని తెలిపారు. బెటాలియన్ అభివృద్ధికి సంబంధించి కొన్ని సెటప్ గోల్స్ పెట్టుకున్నామని అవి సాధించే దిశగా అధికారులు మరియు సిబ్బంది కృషి చేస్తున్నామని డి.ఐ.జి గారికి తెలిపారు.

అనంతరం గౌరవ DIG గారు మాట్లాడుతూ పోలీసు సిబ్బంది యుక్క కవాతు చాలా బాగుంది అని తెలిపారు.విధి నిర్వహణలో మీరు చూపించే ధైర్యసాహసాలు, అంకితభావం మొత్తం పోలీసు వ్యవస్థకే వన్నె తెచ్చాయని సిబ్బందిని ప్రశంసించారు. బెటాలియన్ అధికారులు మరియు సిబ్బందితో కలిసి గౌరవ DIG గారు ధర్భార్ కార్యక్రమములో పాల్గొని సిబ్బంది యొక్క సమస్యలను అడిగి తెలుసుకోవటం జరిగింది. విధి నిర్వహణలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన సిబ్బందికి ప్రశంసపత్రాలు అందించారు.అనంతరం బెటాలియన్ లో నూతనంగా ఏర్పాటు చేయబోయే యూనిట్ క్యాంటీన్ యొక్క భూమి పూజ కార్యక్రమంలో పాల్గొన్నారు.

ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ కమాండెంట్ లు శ్రీ ఎ. జయప్రకాష్ నారాయణ గారు,యమ్.పార్థసారథి రెడ్డి గారు, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ శ్రీమతి బి.శైలజ గారు,అధికారులు మరియు సిబ్బంది పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here