వరంగల్ సభకు గులాబీ రంగులో 25 అంబాసిడర్ కార్ల ర్యాలీ..

0
149

– జెండా ఊపిన ఎమ్మెల్సీ కవిత

బలగం టీవీ, హైదరాబాద్:

బీఆర్ఎస్ పార్టీ సిల్వర్ జూబ్లీ వేడుకల సందర్భంగా శేరి లింగంపల్లికి చెందిన బీఆర్ఎస్ నాయకులు రవి యాదవ్ వినూత్నంగా 25 అంబాసిడర్ కార్లను గులాబీ రంగుతో ఆకర్షణీయంగా ఏర్పాటు చేశారు. ఈ ప్రత్యేక వాహనాల శ్రేణిని బంజారా హిల్స్‌లోని తన నివాసం నుండి బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత జెండా ఊపి ప్రారంభించారు.

టీఆర్ఎస్ పార్టీ గుర్తు అయిన అంబాసిడర్ కారును గులాబీమయం చేసి, 25 కార్లతో ఎల్కతుర్తి సభా ప్రాంగణానికి బయలుదేరిన రవి యాదవ్‌ను ఎమ్మెల్సీ కవిత అభినందించారు. కేసీఆర్ మీద, బీఆర్ఎస్ పార్టీ మీద రవి యాదవ్ చూపిస్తున్న ప్రేమ, ప్రజల ఆదరణ పొందాలని ఆమె మనస్ఫూర్తిగా కోరుకున్నారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్సీ కవిత మాట్లాడుతూ, రవి యాదవ్ పార్టీ పట్ల ఉన్న అభిమానానికి ఇది నిదర్శనమని కొనియాడారు. గులాబీ రంగుతో ముస్తాబైన అంబాసిడర్ కార్ల ర్యాలీ అందరినీ ఆకట్టుకుంటోందని ఆమె అన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here