పురపాలక సంఘ పాలకవర్గంపై బురదజల్లే ప్రయత్నం కాంగ్రెస్ నాయకులకు తగదు…
సిరిసిల్ల మున్సిపాల్ చైర్మన్ జిందం కళా చక్రపాణి
బలగంటివి ,సిరిసిల్ల:
గత బీఅర్ఎస్ ప్రభుత్వం సిరిసిల్ల అభివృద్ది కోసం 40 కోట్ల ను కేటాయిస్తే,కోత్తగా వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం అట్టి 40 కోట్ల పనులను నిలిపివేసి,ప్రజలను పక్కదోవ పట్టించేలా కేవలం 2 కోట్ల రూపాయలను సిరిసిల్ల పురపాలక సంఘానికి కేటాయించడం కాంగ్రెస్ ప్రభుత్వానికి ఎంతవరకు సమంజసం మని సిరిసిల్ల మున్సిపాల్ చైర్మన్ జిందం కళా చక్రపాణి అన్నారు. శుక్రవారం సిరిసిల్ల మున్సిపాలిటి అఫీస్ ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో చైర్మన్ కళా చక్రపాణి మాట్లాడుతూ గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే అప్పటి మంత్రి, ప్రస్తుత ఎమ్మోల్యే కేటిఅర్ కార్మిక క్షేత్రమైన సిరిసిల్లను అభివృద్ధి కోసం 40 కోట్ల, కొత్తచెరువు వద్ద కాలువ నిర్మాణం కోసం 15 కోట్ల రూపాయలను కేటాయించారనీ కొంతమంది కాంగ్రెస్ నాయకులు పనిగట్టుకుని సిరిసిల్ల పురపాలక సంఘ పాలకవర్గంపై బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారనీ అన్నారు.నిరాధారమైన ఆరోపణలు చేసే నాయకులు గతంలో పురపాలక సంఘ పాలకవర్గ సభ్యులుగా, ప్రజలకు సేవలు అందించిన వారే కావడం,కనీసం పురపాలక సంఘ సేవల పట్ల అవగాహన లేకుండా మాట్లాడడం చాలా బాధాకరమని అన్నారు.సిరిసిల్ల పట్టణ అభివృద్ధి కోసం విలీన గ్రామాలను పట్టణాలను కలుపుతూ లింక్ రోడ్లను ఏర్పాటు చేయడం కోసం వివిధ జంక్షన్ లను అభివృద్ధి పరచడం కోసం ప్రజలకు అత్యవసరమగు మౌలిక సదుపాయాలను కల్పించాలని గత సంవత్సరం అగస్ట్ నేలలో 40 కోట్ల రూపాయల ప్రత్యేక నిధులను సిరిసిల్ల పురపాలక సంఘం కు కేటాయిస్తూ తెలంగాణ ప్రభుత్వం జీవోను విడుదల చేసినాదనీ అన్నారు.అన్ని అనుమతుల రాగనే డిసెంబర్ నెలలో 40 కోట్ల రూపాయలకు సంబంధించిన అభివృద్ధి పనుల కోసం టెండర్లను పిలవడం జరిగింది అని అన్నారు.టెండర్ ప్రక్రియ పూర్తి చేసి టెండర్లు ఓపెన్ చేసి ,అభివృద్ధి పనులను ప్రారంభించేలోపే ఎలక్షన్ కోడ్ రావడం వల్ల పనులు ప్రారంభించలేదు అని,అంతే తప్ప ఇందులో ఎంటువంటి అలసత్వం లెదు అని అన్నారు. విలీన గ్రామాలు కలిసి పట్టణ విస్తీర్ణం పెరగడం వల్ల ప్రజలకు మెరుగైన సేవలు అందించడం కోసం ఆదాయం కంటే ఖర్చు ఒక్కొక్కసారి ఎక్కువవుతుంది అని అన్నారు. పురపాలక సంఘ అభివృద్ధికి పాటుపడుతూ ప్రజలకు మెరుగైన సేవలు అందించడం కోసం పాలకవర్గ సభ్యులం గత ప్రభుత్వ కేటిఅర్ ఆలోచనల అభివృద్ది కృషి చేస్తూనే ఉంటున్నామని అన్నారు..