- ఇప్పటివరకు లక్ష ముప్పై మూడు వేల ఉద్యోగాలు ఇచ్చాం
- ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు బోయిన్పల్లి వినోద్ కుమార్
గులాబీ ఎజెండా అభివృద్ధి
- సిరిసిల్ల న్యూస్:
- గులాబీ జెండా,ఎజెండా అభివృద్ధి అని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ అనేక సంక్షేమ పథకాలను అమలు చేసి ప్రవేశపెట్టిన మహనీయుడు అని రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు బోయిన్పల్లి వినోద్ కుమార్ అన్నారు. ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో బుధవారం మొదటగా స్థానిక పాత బస్టాండ్ సమీపంలో బీఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని నాప్స్కాప్ చైర్మన్ కొండూరు రవీందర్ రావు, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు తోట ఆగయ్య, జడ్పిటిసి చీటీ లక్ష్మణరావు, ఎంపీపీ పిల్లి రేణుక లతో కలిసి ప్రారంభించారు. అనంతరం ఏర్పాటుచేసిన బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల సమావేశంలో వారు మాట్లాడుతూ ఇప్పటివరకు 1,33,000 మందికి ఉద్యోగాలు కల్పించామని 83000 మందికి ఉద్యోగ నోటిఫికేషన్లు ఇవ్వడం జరిగిందన్నారు. తమ ప్రత్యర్థి పార్టీ కాంగ్రెస్ పార్టీ అని స్పష్టం చేస్తూ రేవంత్ రెడ్డి అమెరికాలో మాట్లాడుతూ రైతులకు మూడు గంటల కరెంటు మాత్రమే ఇస్తామనడం సిగ్గుచేటని దుయ్యబట్టారు. ఉచిత కరెంటు ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వమే అని గుర్తు చేశారు. గతంలో తెలంగాణ వ్యాప్తంగా కేవలం ఐదు మెడికల్ కాలేజీలు మాత్రమే ఉండేవని తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక ముఖ్యమంత్రి కేసీఆర్ 35 మెడికల్ కళాశాలలను ఏర్పాటు చేయడం ఓ గొప్ప శుభ సూచకమని కొనియాడారు. ప్రతి కార్యకర్త , ప్రతి నాయకుడు కలిసికట్టుగా పనిచేసి వారి వారి ఓట్లను బిఆర్ఎస్ పార్టీకి ఓటు వేయించే విధంగా కృషి చేయాలని పిలుపునిచ్చారు. భారీ మెజారిటీతో బిఆర్ఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్, సిరిసిల్ల అసెంబ్లీ అభ్యర్థి కేటీఆర్ ను గెలిపించుకోవాలని సూచించారు. టెక్స్టైల్ కార్పొరేషన్ చైర్మన్ గూడూరి ప్రవీణ్, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు చీటీ నర్సింగరావు, స్థానిక సర్పంచ్ నెవూరి వెంకట్ రెడ్డి, బీఆర్ఎస్ మండల అధ్యక్షులు వరుస కృష్ణ హరి, మాజీ జెడ్పిటిసి వడ్నాల నరసయ్య, ఏఎంసీ చైర్మన్ ఎల్సాని మోహన్ కుమార్, సీనియర్ నాయకులు అందే సుభాష్, పట్టణ అధ్యక్షులు బండారి బాల్ రెడ్డి, మండల కో ఆప్షన్ మెంబెర్ జబ్బర్, ఎంపీటీసీలు నాగరాణి పరుశురాం గౌడ్,మామిండ్ల తిరుపతి,అనసూయ నర్సింలు, సింగిల్ విండో డైరెక్టర్ వెంకట నరసింహారెడ్డి, ఎస్టీ సెల్ మండల అధ్యక్షులు సిత్యా నాయక్, ఎస్సీ సెల్ మండల అధ్యక్షులు ఎడ్ల సందీప్, గుళ్ళపల్లి నరసింహారెడ్డి, కుంభాల మల్లారెడ్డి, కొండ రమేష్, నంది కిషన్,మేగి నర్సయ్య,మీసం రాజం, మండల మహిళా అధ్యక్షురాలు అప్సర్ ఉన్నిసా అజ్జు, శ్యామ మంజుల, ప్రదీప్ గౌడ్, కొడుమోజు దేవేందర్, అఫ్జల్, వివిధ గ్రామాల సర్పంచులు కార్యకర్తలు నాయకులు పాల్గొన్నారు.