బీసీ సంక్షేమానికి 60 వేల కోట్లు కేటాయించాలి..

0
39

బలగం టీవీ, రాజన్న సిరిసిల్ల :

రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టనున్న బడ్జెట్లో బీసీ సంక్షేమానికి 60 వేల కోట్లు కేటాయించాలని జాతీయ బీసీ సంక్షేమ సంఘం యూత్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శీలం స్వామి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ముస్తాబాద్ మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో శీలం స్వామి మాట్లాడుతూ రాష్ట్ర బడ్జెట్‌లో బీసీలకు 60 వేల కోట్లు కేటాయించి, బీసీ సబ్ ప్లాన్ వెంటనే అమలు చేయాలంటూ డిమాండ్ చేశారు.

కాంగ్రెస్ పార్టీ ఎన్నికల హామీ ప్రకారం బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించి, ఐదేళ్లలో ఒక లక్ష కోట్ల బడ్జెట్‌ను బీసీల సంక్షేమానికి కేటాయించాలని, గత సంవత్సరాల కేటాయింపులు తగిన విధంగా ఉపయోగించబడలేదని తెలిపారు. బీసీ స్టడీ సర్కిల్‌లు, గురుకులాలు, ప్రత్యేక పాఠశాలలు, బీసీ కార్పొరేషన్లు, ప్రోత్సాహకాలు పల్లెల్లో, పట్టణాల్లో ఏర్పాటు చేయాలి. నిరుద్యోగ యువతకు ఉపాధి మార్గాలు చూపించాలని, లేకపోతే బీసీ సంఘాలు ప్రభుత్వంపై పోరాటానికి సిద్ధమవుతాయని హెచ్చరించారు.

ఈ కార్యక్రమంలో బీసీ నాయకులు జాల బిక్షపతి, పుల్లూరి రవి, బద్ద వెంకటి, మోతే నర్సింలు, బద్ద నాంపెల్లి, నీరటి శేఖర్ పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here