బలగం టీవి, ముస్తాబాద్ :
ముస్తాబాద్ మండలం నామాపూర్ గ్రామంలోని ఆదర్శ పాఠశాలలో వచ్చే విద్యా సంవత్సరం 2024-25 ప్రవేశాలకు గాను ఆరవ తరగతి నోటిఫికేషన్ విడుదల చేశారు.ఈ సందర్బంగా పాఠశాల,కళాశాల ప్రిన్సిపాల్ అరుణ్ కుమార్ మాట్లాడుతూ ప్రస్తుతం ఐదో తరగతి చదువుతున్న విద్యార్థులు ఫిబ్రవరి 22 తేదీ వరకు దరఖాస్తు చేసుకోవాల్సిందిగా తెలియజేశారు.అదేవిధంగా 7 నుంచి 10 తరగతిలో మిగులు సీట్లకు కూడా దరఖాస్తు చేసుకోవచ్చని దరఖాస్తులు www.telanganams.cgg.gov.in* వెబ్ సైట్ ద్వారా చేసుకోవచ్చునని దరఖాస్తు చేసుకున్న విద్యార్థులకు ఏప్రిల్ నెల 7వ తేదీన ప్రవేశ పరీక్ష
నిర్వహించబడుతుందని పేర్కొన్నారు