కేసీఆర్ పాలనలో 812 టీఎంసీల నీటిని సీమకు దోచిపెట్టారు..-హామీల అంశాన్ని దారి మళ్లించేందుకే కాంగ్రెస్ డ్రామా

0
96

బలగం టివి,   ,రాజన్న సిరిసిల్ల :

  • దేశవ్యాప్తంగా 400పైగా సీట్లను బీజేపీ గెలవబోతోంది..
  • బీఆర్ఎస్ కు ఓటేస్తే డ్రేనేజీలో వేసినట్లే..

-రాముడిని మొక్కే వాళ్లంతా బీజేపీకి ఓటేయండి..

హామీలను విస్మరించిన కాంగ్రెస్ ను కడిగిపారేయండి
-బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ కుమార్..

అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయలేక కాంగ్రెస్ ప్రభుత్వం చేతులెత్తేసిందని, తెలంగాణ ప్రజలను దారి మళ్లించేందుకు కృష్ణా జలాల అంశాన్ని తెరపైకి తీసుకువచ్చింది. గత బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజలకు చేసిన మోసాలు, అవినీతి బయటకు రాకుండా బీఆర్ఎస్ నేతలు ఎదురు దాడి చేస్తున్నారు అని, రెండు పార్టీలు మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకుని అసెంబ్లీ సమయాన్ని వృధా చేస్తున్నాయని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ కుమార్ అన్నారు.ప్రజాహిత యాత్రలో భాగంగా రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ నియోజకవర్గంలోనీ బాలరాజుపల్లె, చెక్కపల్లి, నూకలమర్రి గ్రామాల్లో పాదయాత్ర చేశారు. అనంతరం నూకలమర్రిలో ప్రజలను ఉద్దేశించి బండి సంజయ్ మాట్లాడుతూ కృష్ణ జలాల్లో తెలంగాణ వాటా 512 టీఎంసీలు రావాల్సి ఉండగా, 299 టీఎంసీలకే అంగీకరించి గత 10 ఏళ్లలో 812 టీఎంసీల నీటిని ఏపీకి దోచిపెట్టి బీఆర్ఎస్ మోసం చేస్తే, పోతిరెడ్డిపాడుకు పొక్కపెట్టి 4 వందలకు పైగా టీఎంసీల నీటినీ సీమకు కట్టబెట్టి కాంగ్రెస్ మోసం చేసిందన్నారు. రెండు పార్టీలు కలిసి దక్షిణ తెలంగాణను ఎడారిగా మార్చి ప్రజల నోట్లో మట్టికొట్టారని అన్నారు.రాముడిని మొక్కేటోళ్లంతా అయోధ్య గుడి కట్టిన బీజేపీకి ఓటేయండి అని,దేవుడక్కర్లేదు,దేవుడిని మొక్కని వాళ్లు కాంగ్రెస్, బీఆర్ఎస్ లకు ఓటేయండి అని అన్నారు.వేములవాడ రాజన్న ఆలయ అభివ్రుద్ధికి రూ.500 కోట్లు ఇస్తానని కేసీఆర్ మోసం చేసిం డు అని, బ్రిడ్జి నుండి రాజన్న ఆలయం బద్ది పోచమ్మ గుడి వద్ద నుండి పోలీస్ స్టేషన్ వరకు రహదారి విస్తరణ కోసం జనం ఎదురు చూస్తున్నరనీ అన్నారు
వేములవాడ నియోజకవర్గ అభివ్రుద్ధి కోసం మోదీ ప్రభుత్వం 575 కోట్ల 95 లక్షలకుపైగా నిధులిచ్చిందనీ అన్నారు. దమ్ముంటే కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతలు వేములాడ నియోజకవర్గ అభివృద్ధికి ఖర్చు చేసిన నిధులను వెల్లడించాలనీ డిమాండ్ చేశారు.
వేములాడ రాజన్న ఆలయ అభివృద్ధికి నిధులిస్తామని, ప్రసాదం స్కీం కింద ప్రతిపాదనలు పంపాలని కోరినా రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోలేదని అన్నారు. నన్ను మళ్లీ ఎంపీగా గెలిపిస్తే రాజన్న, కొండగట్టు అంజన్న ఆలయాలను అభివృద్ధి చేసే బాధ్యత తీసుకుంటానని హామీ ఇచ్చారు.
కాంగ్రెస్ ఇచ్చిన హామీలను అమలు చేయబోమని బడ్జెట్ సాక్షిగా సీఎం చేతులెత్తేశారని,హామీలన్నీ అమలు కావాలంటే రూ.5 లక్షల కోట్లు కావాలి,కానీ సర్కార్ దగ్గర పైసల్లేవ్ అని అన్నారు. కేసీఆర్ సర్కార్ పై మేం కొట్లాడితే కేసీఆర్ పై కోపంతో ప్రజలు కాంగ్రెస్ కు అధికారమిచ్చారనీ అన్నారు. ప్రజలు ఛీత్కరించిన బీఆర్ఎస్ తో బిజెపి పొత్తు పెట్టుకోదని,దేశవ్యాప్తంగా 400 వందల ఎంపీల సీట్లు బీజేపీ గెలవబోతోందనీ అన్నారు.
ఆంధ్రోళ్లకు అమ్ముడుపోయి కేసీఆర్ కృష్ణ నీళ్లను ఏపీకి తాకట్టుపెడితే,ఈ కాంగ్రెసోళ్లు పోతిరెడ్డిపాడుకు పొక్కపెట్టి దక్షిణ తెలంగాణ ప్రజల గుండె మీద తన్నీరు అని అన్నారు.ఆనాడు నిండు అసెంబ్లీలో కృష్ణ నీటిని అక్రమంగా పోతిరెడ్డిపాడు ద్వారా వైఎస్సార్ నీళ్లు తీసుకుపోతున్నారని తెలిసి కూడా నోరు మెదపని దద్దమ్మలు తెలంగాణ కాంగ్రెస్ నేతలు అని అన్నారు.
గత ప్రభుత్వం చేసిన మోసాలు బయటకు రాకుండా బీఆర్ఎస్ నేతలు షో చేస్తున్నరనీ కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకుని ప్రజలకు ఇచ్చిన హామీలను గాలి కొదిలేస్తున్నరు అని అన్నారు.తెలంగాణను మోసగించిన కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలకు ఎంపీ ఎన్నికల్లో బుద్ది చెప్పాలని అన్నారు. తెలంగాణ ప్రజల పక్షాన పోరాడుతున్న ఏకైక పార్టీ బీజేపీ అని,మీకోసం పోరాడిన బీజేపీకే ఓటు వేయాలని కోరారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here