బలగం టీవీ, రాజన్న సిరిసిల్ల:
- ఆన్లైన్ సెంటర్ లే లక్ష్యంగా సైబర్ నేరాలకు పాల్పడుతున్న ఐదుగురిపై కేసు నమోదు, నాలుగురు అరెస్ట్, ఒకరు పరారీ.
- ఐదుగురు నిందుతులపై దేశవ్యాప్తంగా వ్యాప్తంగా NCRP లో నమోదు అయిన 54 పిటిషన్లలో 30,0000/- లక్షలకు పై మోసాలు..
- ఆరు మొబైల్ ఫోన్స్ స్వాధీనం.
- మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించిన జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఐపీఎస్.,
ఈ సందర్భంగా ఎస్పీ అఖిల్ మహాజన్ మాట్లాడుతూ.. మహారాష్ట్ర భీవండి కి చెందిన దాసరి మురళి అనే వ్యక్తి భీవండి లో ఫాస్ట్ ఫుడ్ సెంటర్ నడిపించుకుంటు వచ్చిన డబ్బుతో జీవనం కోసాగించగా విలాసవంతమైన జీవితాలకు అలవాటు పడి ఎలాగైనా సులభ మార్గంలో డబ్బులు సంపాదించాలని భివండి కి చెందిన తన స్నేహితులు అయిన విలేష్ పటేల్, చిరగ్ రమేష్ పేతడ్, జింతేంద్ర సోమాభాయ్, నిలేష్ జై సింగ్ అనే వ్యక్తులతో కలసి ఒక ముఠాగా ఏర్పడి మురళి అనే ఆన్లైన్ సెంటర్ లను లక్ష్యంగా చేసుకొని మొదటగా ఆన్లైన్ సెంటర్ వ్యక్తులకు కాల్ చేసి తనని తను ఒక ఉన్నత స్థాయిలో ఉన్న వ్యక్తిగా పరిచయం చేసుకుని నాకు రోజు వారిగా నాకు ఆన్లైన్ లావాదేవీలు ఎక్కువగా ఉంటాయి నేను మా వారితో నగదు డబ్బులు పంపిస్తాను నాకు ఆన్లైన్ ట్రాన్స్ఫర్ చేయాలని నమ్మించి విలేష్ పటేల్, చిరగ్ రమేష్ పేతడ్, జింతేంద్ర సోమాభాయ్, నిలేష్ జై సింగ్ ల అకౌంట్ లోకి వెళ్లేలా ప్రణాళిక చేసుకొని వారి అకౌంట్ లోకి వచ్చిన నగదు ను ఐదుగురు పంచుకుంటూ మోసాలకు పాల్పడటం జరుగుతుంది.
నేరం చేసిన విధానం
రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణ పరిధిలోని అగ్రహారంలో గల ఒక ఆన్లైన్ సెంటర్ ను మరియు సిరిసిల్లలో గల ఫాస్ట్ ఫుడ్ సెంటర్ ను లక్ష్యంగా చేసుకొని దాసరి మురళి అనే నిందుతుడు అగ్రహారం నందు గల ఆన్లైన్ సెంటర్ కు సంబంధించిన చీర్లవంచ ఆర్ అండ్ ఆర్ కాలనీ కి చెందిన ఇనుకొండ మహేష్ అనే వ్యక్తికి ఫోన్ ద్వారా తను సిరిసిల్ల సివిల్ హాస్పిటల్ లో పనిచేస్తున్న డాక్టర్ రాజిరెడ్డి అని పరిచయం చేసుకొని ఫోన్లో మాట్లాడి మీ షాపులో డబ్బులు చేతికిస్తే నా అకౌంట్ కు కమిషన్ తీసుకుని మనీ ట్రాన్స్ఫర్ చేస్తారా అని అడుగగా ఇనుకొండ మహేష్ అలాగే చేస్తాను అని ఒప్పుకున్నాడు.మురళి అనే వ్యక్తి మహేష్ తో ఒక వ్యక్తిని పంపిస్తాను అతను వచ్చి నీకు డబ్బు ఇస్తాడని చెపుతాడు.
ఇదే విధంగా దాసరి మురళి అనే నిందుతుడు సిరిసిల్ల కు చెందిన ఫాస్ట్ ఫుడ్ సెంటర్ కు చెందిన యజమానికి ఫోన్ చేసి డిగ్రీ కాలేజ్ రాజిరెడ్డి సార్ గా పరిచయం చేసుకున్నాడు. ఫోన్లో అతనితో 110 బిర్యానీలు పార్సెల్ రేపటి కోసం ఆర్డర్ కావాలి అని అడగగా, ఫాస్ట్ ఫుడ్ సెంటర్ అతను అడ్వాన్స్ పంపించండి సార్ అని చెప్పాడు. దాసరి మురళి అగ్రహారం డిగ్రీ కాలేజ్ ఎదురుగా మహేష్ అనే అతను ఆన్లైన్ సెంటర్ కు వెళ్లి ఫోన్ చేయండి అతనికి నేను చెప్తాను అతడు మీకు అడ్వాన్స్ గా 5000 రూపాయలు ఇస్తాడు అని చెప్పాడు. ఆ విధంగా ఫాస్ట్ ఫుడ్ సెంటర్ అతను ఇనుకొండ మహేష్ యొక్క ఆన్లైన్ సెంటర్ కు వెళ్లి నిందితునికి ఫోన్ చేసి వినుకొండ మహేష్ కి ఇవ్వగా నిందితుడు చెప్పినట్లుగా అతడు ఒకసారి 25000 మరొకసారి 40 వేల రూపాయలు మొత్తం 65 వేల రూపాయలు నిందితుడు చెప్పిన అకౌంట్ కి గూగుల్ పే ద్వారా ట్రాన్స్ఫర్ చేశాడు.
65000 అతను చెప్పిన నెంబర్ కి ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత 65,000 ఇవ్వమని ఫాస్ట్ ఫుడ్ సెంటర్ అతను మహేష్ ని అడుగగా, అతను దీనికి బదులుగా మీరే నాకు 5000 ఇవ్వాలి కదా బిరియాని ఆర్డర్ కోసం అని చెప్పగా ఇద్దరు మోసపోయారు అని గ్రహించి వేములవాడ పట్టణ పోలీస్ స్టేషన్లో పిర్యాదు చేయగా వేములవాడ పట్టణ పోలీస్ వారు కేసు నమోదు చేసి వేములవాడ పట్టణ ఇన్స్పెక్టర్ వీరప్రసాద్,సైబర్ సెల్ టీం జునైద్, గంగి రెడ్డి,మహేష్, వేములవాడ పట్టణ ఎస్.ఐ ప్రేమనందం, సంపత్ లతో స్పెషల్ టీం ఏర్పాటు చేసి దర్యాప్తు చేపట్టగా సాంకేతికత ఆధారంగా ఈ రోజు బీవండిలో నాలుగురు వ్యక్తులను అరెస్ట్ చేయడం జరిగిందని,పరారీలో ఉన్న దాసరి మురళి అనే వ్యక్తిని త్వరలో పట్టుకోవడం జరుగుతుదన్నారు.ఈ ఐదుగురు నిందుతులు దేశవ్యాప్తంగా NCRP లో 54 ఫిర్యాదులలో 30 లక్షలకు పై మోసాలకు పాల్పడం జరిగిందని,వీరిపై ఇంకా 100 కి పైగా ఫిర్యాదులు వచ్చే అవకాశం ఉందన్నారు.
ఈ ఐదుగురు నిందుతులను వెనుక ఉండి ప్రధాన పాత్ర పోషించిన గుజరాత్ రాష్టానికి చెందిన కీలక నిందుతున్నీ పట్టుకోవడానికి స్పెషల్ టీమ్ ఏర్పాటు చేసి త్వరలో పట్టుకోవడం జరుగుతుంది.
ఈ కేసులో నిందితులను పట్టుకోవడంలో ప్రధాన పాత్ర పోషించిన వేములవాడ పట్టణ ఇన్స్పెక్టర్ వీరప్రసాద్,సైబర్ సెల్ టీం జునైద్, గంగి రెడ్డి,మహేష్, వేములవాడ పట్టణ ఎస్.ఐ ప్రేమనందం, సంపత్ లను జిల్లా ఎస్పీ అభినందించారు.
మీడియా సమావేశంలో వేములవాడ ఏఎస్పీ శేషాద్రిని రెడ్డి, పట్టణ ఇన్స్పెక్టర్ వీరప్రసాద్, ఎస్.ఐ ప్రేమనందం, సైబర్ ఎస్.ఐ జునైద్, కానిస్టేబుళ్లు గంగిరెడ్డి, మహేష్, సంపత్ పాల్గొన్నారు.