వరకట్నం వేధింపులకు గురిచేసిన ఆరుగురిపై కేసు నమోదు

0
124

బలగం టీవీ, ఎల్లారెడ్డిపేట:

రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం లో ఇద్దరు మహిళలను ఆరుగురు వ్యక్తులు అదనంగా వరకట్నం తేవాలని వేదించిన సంఘటనలో కేసు నమోదు చేసినట్లు ఎస్సై రమాకాంత్ తెలిపారు. పోలీసుల కథనం ప్రకారం మండల కేంద్రానికి చెందిన దున్నపోతుల లావణ్యను రెండు సంవత్సరాల క్రితం ముస్తాబాద్ మండలానికి చెందిన రాజుకి ఇచ్చి వివాహం జరిపించారు. అప్పటి లాంచనాల ప్రకారం నాలుగు లక్షల రూపాయల కట్నంతో పాటు బంగారం నగలు కట్న కానుకలు ఇచ్చి ఘనంగా వివాహం జరిపించారు. గత కొన్ని రోజులుగా అదనంగా లక్ష రూపాయలు తేవాలంటూ భర్త రాజు భర్త కనకవ్వలు మానసికంగా శారీరకంగా వేధింపులకు గురిచేసారని బాధితులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేయగా మరో సంఘటనలో రాజన్నపేట గ్రామానికి చెందిన ఎర్రోళ్ల రేఖ అనే మహిళను కొత్త పెళ్లికి చెందిన రమేష్ తో 16 సంవత్సరాల క్రితం ఐదు లక్షల రూపాయల నగదు 9 తులాల బంగారం అభరణాలు ఇచ్చి వివాహం జరిపించారు. ఆరు సంవత్సరాలుగా భర్త రమేష్, ఆడపడుచులు కిట్టవ్వ, శాంతవ్వ, నరసవ్వ లు అదనంగా 5 లక్షల రూపాయల కట్నం తేవాలంటూ శారీరకంగా మానసికంగా వేధింపులకు గురి చేయడంతో బాధితురాలు సోమవారం పోలీసుల ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here