బలగం టీవి , ఎల్లారెడ్డిపేట
రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం రాచర్ల గొల్లపల్లి గ్రామ శివారులో ముగ్గురు వ్యక్తులు బహిరంగ ప్రదేశంలో మద్యం సేవించగా పోలీసులు వారిపై కేసు నమోదు చేశారు. పోలీసుల వివరాలు ప్రకారం మండలంలోని రాచర్ల గొల్లపల్లి గ్రామ శివారులో బ్లూ కోర్ట్ కానిస్టేబుల్ సతీష్, హోంగార్డ్ అశోక్ లు పెట్రోలింగ్ నిర్వహిస్తుండగా ముగ్గురు వ్యక్తులు బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవిస్తూ పట్టు పడగా వారిపై కేసు నమోదు చేశామని పోలీసులు తెలిపారు. ఈ సందర్భంగా ఎస్ఐ రమాకాంత్ మాట్లాడుతూ…. ఎవరైనా సరే బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించిన, మద్యం సేవించి వాహనాలు నడిపిన వారి పైన కేసులు నమోదు చేసి శాఖ పరిమళి చర్యలు తీసుకుంటామని వారు అన్నారు.