బలగం టీవి ,ఎల్లారెడ్డిపేట
రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం హరిదాసునగర్ గ్రామంలో ముగ్గురు వ్యక్తులు అక్రమంగా ఇసుక రవాణా చేస్తుండగా పోలీసులకు పట్టు పడగా కేసు నమోదు చేశామని ఎస్ఐ రమాకాంత్ తెలిపారు. పోలీసుల వివరాలు ప్రకారం మండలంలోని హరిదాసు నగర్ గ్రామ శివారులో పెట్రోలింగ్ నిర్వహిస్తుండగా ఎదురుగా మూడు ఇసుక ట్రాక్టర్లు రాగా వాటిని ఆపి తనిఖీ చేయగా తాసిల్దార్ ఇచ్చిన గడువు ముగిసిన గాని నిబంధన ఉల్లంఘిస్తూ ఇసుక రవాణా చేస్తున్నట్లు నిర్ధారణ కాగా అట్టి ట్రాక్టర్లను సీజ్ చేసి పోలీస్ స్టేషన్ తరలించి అక్రమ ఇసుకకు బాధ్యులైన గడ్డం భార్గవ్, పులి కిషన్, కూడలి అశోక్ లతో పాటు యజమానులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్ఐ తెలిపాడు.