బలగంటివి,
రాజన్న సిరిసిల్లా జిల్లా కోర్టులో ఫోక్సో
పబ్లిక్ ప్రాసిక్యూటర్ గా నియామకమైన సందర్భంగా చిన్ననాటి మిత్రుడు పెంట శ్రీనివాస్ కు తనతో పాటు పదవ తరగతి వరకు చదువుకున్న బాల్య మిత్రులు
ఆదివారం రోజున తాము చదువుకున్న చందుర్తి
ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో ఘనంగా సన్మానించారు .
ఈ సందర్భంగా శ్రీనివాస్ మాట్లాడుతూ తన బాల్య మిత్రులు తనకు సన్మానం చేయడం చాల సంతోషంగా ఉందని, వృత్తిలో భాగంగా ప్రజలకు సేవ చేసే అవకాశం రావడం అదృష్టంగా భావిస్తున్నాను అని అన్నాడు, అనంతరం స్నేహితులతో కలిసి చిన్ననాటి బాల్య స్మృతులను గుర్తుకు తెచ్చుకుని సంతోషంగా గడిపారు,తమ బాల్య మిత్రుడు పబ్లిక్ ప్రాసిక్యూటర్ గా పని చేయడం చాల ఆనందంగా ఉందని, మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు .
ఈ కార్యక్రమంలో మేడికాల అంజయ్య, మరాఠీ దామోదర్, ఉప్పుల మహెశ్, అజిబాబు, అజిత్ పాష, పోతరాజు రవి, ఎడ్ల వెంకటేశం, కట్ట రాములు, కత్తి రాజుగౌడ్, రవితేజ, మేడిశెట్టి ప్రభకర్, తదితరులు పాల్గొన్నారు.