బలగం టివి ,
- అన్యాక్రాంతం అయినట్లు
ఆధారాలతో ఫిర్యాదు వస్తే బాధ్యులపై
కలెక్టర్, ఎస్పి లు కఠిన చర్యలు తీసుకోవాలి - సెస్ అక్రమాల పై ప్రభుత్వం సీరియస్.
బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామం
:మంత్రి శ్రీ పొన్నం ప్రభాకర్
జిల్లాలో భూఅక్రమార్కులపై ఉక్కుపాదం
మోపాలనీ జిల్లా యంత్రాంగానికి*
రాష్ట్ర రవాణా, బీసి సంక్షేమ శాఖ మంత్రి శ్రీ పొన్నం ప్రభాకర్ ఆదేశించారు.
మంగళవారం అభివృద్ధి , సంక్షేమ కార్యక్రమాల ప్రగతి పై అన్ని ప్రభుత్వ శాఖల అధికారులతో రాష్ట్ర రవాణా, బీసి సంక్షేమ శాఖ మంత్రి శ్రీ పొన్నం ప్రభాకర్ ప్రభుత్వ విప్,ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్, చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం, కలెక్టర్ అనురాగ్ జయంతి, అదనపు కలెక్టర్ ఎన్ ఖిమ్యా నాయక్, జిల్లా ఫారెస్ట్ అధికారి బాలమని తో కలిసి సిరిసిల్ల IDOC లో సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ…
2014 కు ముందు ప్రభుత్వ భూమిగా రికార్డ్ లో ఉండి.. తర్వాత అన్యాక్రాంతం అయిన భూముల పై ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు.
అన్యాక్రాంతం అయిన భూములను బూబకాసరుల కబంధ హస్తాల నుంచి విడిపించి
తిరిగి స్వాధీనం చేసుకోవాలనీ జిల్లా యంత్రాంగంకు విస్పష్ట ఆదేశాలు జారీ చేశారు.
స్వాధీనం చేసుకున్న స్థలాలను విద్యా సంస్థల నిర్మాణాలు, ప్రభుత్వ అవసరాలకు ఉపయోగించుకోవాలన్నారు.
జిల్లాలో బిడ్డ పెళ్లి కోసమో, తమ బిడ్డల ఉన్నత చదువుల కోసమో ముందు చూపుతో పైసా పైసా కూడ బెట్టి కొనుగోలు చేసిన ప్లాట్ లను సైతం
రాజకీయ పలుకుబడి , అధికారుల అండ, కండ బలంతో కబ్జాకొరులు కైంకర్యం చేసిన ఘటనలు ఉన్నాయన్నారు.
తమ స్థలాలను ఎవరైనా ఆక్రమించుకుంటే ప్రజలు తగు ఆధారాలతో జిల్లా కలెక్టర్, ఎస్పీలకు ఫిర్యాదు చేయాలనీ మంత్రి చెప్పారు. మీడియా దృష్టికి తేవాలన్నారు. భూ ఆక్రమణల కోరలుపీకి
కబ్జాదారుల ఆధీనంలోని భూములను విడిపించి నిజ యజమానులకు వాటిని అప్పగిస్తామనిచెప్పారు.
భూ కబ్జాదారుల పై కూడా కఠిన చర్యలు తీసుకునీ ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూస్తామని తెలిపారు.
సెస్ లో అక్రమాలపై ప్రభుత్వం సీరియస్ గా ఉందన్నారు. సెస్ లో అలసత్వం, అక్రమాలకు ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రభుత్వం ఉపేక్షించేదిలేదన్నారు.
సెస్ లో జరిగిన అక్రమాల గురించి ప్రజలకు ఏదైనా సమాచారం ఉంటే కలెక్టర్, ఎస్పి దృష్టికి ఆధారాలతో తీసుకువస్తే బాధ్యులపై చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.
సిరిసిల్ల వస్త్ర పరిశ్రమ పునరుద్ధరణకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది
నేతన్నలకు ప్రభుత్వం వెన్ను దన్నుగా ఉంటుంది
- అధికారులకు నేతన్నలలో మనోధైర్యం ను నింపాలి
సిరిసిల్ల నేత కార్మికులకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలుగా వెన్నుదన్నుగా ఉంటుందని మంత్రి శ్రీ పోన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు.
ఈ విషయంపై ప్రభుత్వం ఇప్పటికే కూలంకషంగా, లోతుగా చర్చించిందన్నారు. సిరిసిల్ల నేతన్నలకు 365 రోజులు పని కల్పించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తుందన్నారు. బతుకమ్మ చీరలతో పాటు పాలి కాటన్ ఉత్పత్తికి రాష్ట్ర ప్రభుత్వం ఆర్డర్లు ఇవ్వనుందన్నారు.
వస్త్ర తయారీకి అవసరమైన యార్న్ ను ప్రభుత్వమే సరఫరా చేయనుందన్నారు.
వర్కర్ టు ఓనర్ పథకానికి లబ్ధిదారులను గుర్తించేందుకు
సేట్లు, ఆసాములతో కాకుండా నేరుగా కార్మికులు, కార్మిక సంఘాలు ప్రతినిధులతో సమావేశం నిర్వహించి ,చర్చించి వారి అభిప్రాయాలను తీసుకావాలనీ సంబంధిత అధికారులకు సూచించారు.
వర్కర్ టు ఓనర్ పథకం కింద పవర్ లూమ్ లు లేని కార్మికులకు యూనిట్లను కేటాయిస్తామని మంత్రి తెలిపారు.
టెక్స్టైల్ పార్క్ లో 2014 కు ముందు 119 పవర్ లూమ్ యూనిట్ లు ఉండగా 2023 నాటికి 60 కి తగ్గాయని అధికారుల నివేదికలు చెబుతున్నాయని మంత్రి అన్నారు. దీనిని బట్టి వస్త్ర పరిశ్రమ బలోపేతానికి ఎవరు అండగా నిలిచారో అర్థం చేసుకోవచ్చనన్నారు.
సిరిసిల్ల వస్త్ర పరిశ్రమ బలోపేతానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు.
అధికారులు కూడా క్షేత్రస్థాయిలో నేతన్నలలో మనోధైర్యాన్ని నింపేందుకు కృషి చేయాలని మంత్రి సూచించారు
వచ్చే వేసవిలో జిల్లాలో త్రాగునీటి ఇబ్బందులు తలెత్తకుండా పకడ్బందీ ఏర్పాట్లు చేయాలి
వచ్చే వేసవిలో రాజన్న సిరిసిల్ల జిల్లాలో త్రాగునీటి ఇబ్బందులు తలెత్తకుండా పకడ్బందీ ఏర్పాట్లు చేయాలనీ మిషన్ భగీరథ అధికారులను రాష్ట్ర రవాణా, బీసి సంక్షేమ శాఖ మంత్రి శ్రీ పొన్నం ప్రభాకర్ ఆదేశించారు.
జిల్లాలో వర్షపాతం తక్కువగా నమోదు కావడం,
జల వనరులలో నీటి నిల్వ తక్కువ ఉండడం వల్ల
వచ్చే వేసవిలో రాజన్న సిరిసిల్ల జిల్లాలో త్రాగునీటి
సమస్యలు తలెత్తే అవకాశం ఉందన్నారు. దీనిని దృష్టిలో పెట్టుకొని సోర్స్, స్టోరేజ్ సిస్టమ్, డిస్ట్రి బ్యూషన్ సిస్టమ్ లను పున:సమీక్షించి సోర్స్ పాయింట్ నుంచి ఎండింగ్ పాయింట్ వరకూ మిషన్ భగీరథ అధికారులు పంచాయితీ రాజ్, ఆర్ అండ్ బి, మున్సిపల్ అధికారులు మూడు రోజుల్లోగా
ఎక్సర్ సైజ్ పూర్తి చేయాలన్నారు. వేసవిలో త్రాగునీటి సరఫరా అన్ని గ్రామాలకు నిరంతరరాయంగా జరిగేలా చూడాలన్నారు.
చేప పిల్లల విత్తన ఉత్పత్తికి మధ్య మానేరు జలాశయం కేంద్ర బిందువు కావాలి
తెలంగాణ మొత్తానికీ చేప పిల్లల విత్తన సరఫరా కు రాజన్న సిరిసిల్ల జిల్లా అన్ని విధాలుగా అనువుగా ఉందన్నారు. మధ్య మానేరు జలాశయం కేంద్రంగా చేప పిల్లల విత్తన ఉత్పత్తి కి కేంద్ర బిందువుగా చేసి ఇక్కడి నుంచే తెలంగాణలోని అన్ని జలాశయాలకు చేప పిల్లలను సరఫరా చేసే కార్యచరణ సిద్ధం చేయాలని మంత్రి ఫిషరీస్ అధికారులకు సూచించారు.
ముంపు గ్రామాల మత్స్యకారులకు
కేజ్ కల్చర్ ద్వారా ఉపాధి
మిడ్ మానేరు ముంపు గ్రామాల్లోని సుమారు 1000 మంది మత్య కారులకు కేజ్ కల్చర్ ద్వారా ఉపాధి కల్పిస్తామని మంత్రి తెలిపారు. స్థానిక ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ సూచన మేరకు ఉపాధి కల్పన కు ప్రాధాన్యత నిస్తున్నట్లు తెలిపారు.
ముంపు గ్రామాల సమస్యలపై సమీక్ష సమావేశం ఏర్పాటు చేయాలని కలెక్టర్ ను ఆదేశించారు.
వారి సమస్యలు ఇక కొనసాగవద్దని మంత్రి స్పష్టం చేశారు. ముంపు గ్రామాల పెండింగ్ సమస్యలను మొత్తం పరిష్కరించాలని చెప్పారు.
ముంపు గ్రామాల యువతకు అవగాహన, శిక్షణా అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టి ప్రభుత్వం ద్వారా స్వయం ఉపాధి కార్యక్రమాల ను అందజేయాలని చెప్పారు.
జిల్లాను పది ఫలితాల లో ముందంజలో నిలపాలి
రానున్న మార్చి లో జరుగనున్న పదో తరగతి పరీక్షల్లో జిల్లా విద్యార్థులు ఉత్తమ ప్రదర్శన చూపి మంచి ర్యాంకులు సాధించేలా, ఫలితాలలో జిల్లాను ముందంజలో నిలిపేలా విద్యా శాఖ అధికారులు పక్కా ప్రణాళికతో ముందుకు వెళ్లాలని మంత్రి సూచించారు. ప్రభుత్వ స్కూళ్లు, వివిధ గురుకుల పాఠశాలలోని విద్యార్థులు పదో తరగతి వార్షిక పరీక్షల్లో మంచి ఫలితాలు సాధిస్తామన్న హామీ పత్రాన్ని సంబంధిత ప్రధాన ఉపాధ్యాయులు, ప్రిన్సిపల్ ల నుంచి తీసుకోవాలని చెప్పారు.
ప్రభుత్వ విద్యా సంస్థలు మంచి ఫలితాలు సాధించేలా విద్యార్థులకు ప్రత్యేక తరగతులు, డైలీ టెస్ట్ లు, రివిజన్ తరగతులు, మోటివేషన్ క్లాస్ లు నిర్వహించాలని చెప్పారు.
పిల్లల చదువుల పై స్కూల్ ల బాధ్యులు, హాస్టల్ వార్డెన్లు శ్రద్ద తీసుకోవాలని సూచించారు.
గుడి చెఱువులో సరిపడా నీరు నిల్వ ఉండేలా చూడాలి
వేములవాడ పట్టణపరిధిలో త్రాగు నీటికి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలన్నారు.
వేములవాడ గుడి చెరువు లో నీటి నిల్వలు సరిపడా ఉండేలా చూసుకుంటూ త్రాగునీటి, సాగునీటి సమస్యలు లేకుండా చూడాలన్నారు.
మహాశివరాత్రి కి వచ్చే భక్తులకు త్రాగు నీటికి మెరుగైన వసతులు కల్పించాలని సూచించారు.
స్టార్ట్ చేయని పనుల వివరాలను అందజేయండి
స్టార్ట్ చేయని పనుల వివరాలను ఇంజనీరింగ్ విభాగాలు వెంటనే ప్రభుత్వానికి నివేదించాలని మంత్రి అధికారులకు సూచించారు.
సంబంధిత ఎమ్మెల్యే కన్సెంట్ లెటర్ ఇస్తే వాటికి తిరిగి అనుమతి ఇస్తామని చెప్పారు.
క్రిటికల్ కేర్ యూనిట్ కు స్థల సేకరణ చేయాలి
ప్రభుత్వ మెడికల్ కళాశాల పురోగతిపై చర్చించిన మంత్రి శ్రీ పోన్నం ప్రభాకర్ ప్రభుత్వ మెడికల్ కళాశాలకు అనుబంధంగా నిర్మించనున్న క్రిటికల్ కేర్ సెంటర్ , ఇతర అనుబంధ విభాగాలు, క్వార్టర్ ల భూ సేకరణ పై అధికారులతో సమీక్షించారు. అవసరమైన స్థలానికి సంబంధించి ల్యాండ్ పూలింగ్ ప్రాసెస్ ను నిబంధనల మేరకు పూర్తిచేసి ఫైనల్ అలాట్మెంట్ సాధ్యమైనంత త్వరగా పూర్తిచేయాలని రెవెన్యూ అధికారులకు మంత్రి సూచించారు.
మాది ఉద్యోగుల ఫ్రెండ్లీ ప్రభుత్వం
- ఉత్తమ సేవలు అందిస్తే అభినందిస్తాం
- నిర్లక్షం చేస్తే చర్యలు తీసుకుంటాం
- మంత్రి పొన్నం ప్రభాకర్
రాష్ట్రంలోని ప్రభుత్వం ఉద్యోగుల ఫ్రెండ్లీగా ఉంటుందని మంత్రి అన్నారు.
ఉత్తమ సేవలు అందించే అధికారులకు ప్రశంసతో పాటువిధుల్లో నిర్లక్షం చేస్తే చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. ప్రజా పాలనలో అధికారుల నుంచి సలహాలు, సూచనలు స్వీకరిస్తామని మంత్రి తెలిపారు.
5వ పేజీ….
ప్రభుత్వ విప్ , ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ…
వేములవాడ పట్టణపరిధిలో త్రాగు నీటికి,సాగు నీటికి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా వేములవాడ గుడి చెరువు లో నీటి నిల్వలు సరిచూసుకోవాలన్నారు.
మహాశివరాత్రి కి వచ్చే భక్తులకు త్రాగు నీటికి మెరుగైన వసతులు కల్పించాలని సూచించారు
ఆగ్రహరంలో బీసీ బాలికల హాస్టల్ కొరకు ప్రభుత్వ విప్ కోరగా మంత్రి సానుకూలంగా స్పందించారు.
రుద్రoగి మండల కేంద్రం నుంచి కొచ్చాగుట్ట తండా రోడ్డు నిర్మాణం పూర్తి చేయాలన్నారు.
వట్టిమల్ల సనుగుల మధ్య వర్షకాలం రాకపోకలకు ఇబ్బంది ఎదురవుతున్న దృష్ట్యా బ్రిడ్జి నిర్మాణం చేపట్టాలన్నారు.ముంపుగ్రామాల ప్రజలుకు స్వయం సహాయకచర్యల్లో భాగంగా కుటీర పరిశ్రమలతో పాటు , ఫిషరీష్ విభాగంలో సాధ్యాసాధ్యాలను పరిశీలించాలని చూసించారు.
అగ్రహారం పరిధిలో గుట్టల భూముల విషయంలో అధికారులు చర్యలు తీసుకోవాలని సూచించారు.
నేతన్నలకు 365 రోజులు పని కల్పించే పథకం త్వరలోనే ప్రారంభం అవుతుందన్నారు.
పాఠశాల విద్యార్థులకు పాలీకాటన్ దుస్తులు అందించే దిశగా చర్యలు చేపడుతున్నామన్నారు.
నేతన్నలను ప్రభుత్వం అన్ని రకాలుగా అండగా రాష్ట్రప్రభుత్వం అండగా ఉంటుందన్నారు.
సెస్ లో జరిగిన అవినీతి పై విచారణ వేగవంతం చేయాలన్నారు.
అగ్రహారం గుట్టల్లో ప్రభుత్వ భూముల లెక్కా తేల్చాలి ప్రభుత్వ విప్,ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్
- జిల్లాలోని ప్రభుత్వ భూముల వివరాలు గూగుల్ మ్యాప్ లో కనిపించేలా చూడాలి
వేములవాడ మండలం అగ్రహారం సమీపంలోనీ గుట్ట లో ప్రభుత్వ, ప్రైవేటు భూముల లెక్కలను తేల్చాలని జిల్లా కలెక్టర్ సూచించారు
ప్రభుత్వ భూమిలోని గుట్టల లెక్కలను హద్దులను నిర్ణయించాలని, పెన్సింగ్ తో ప్రొటెక్షన్ చేయాలని
విప్ ఆది శ్రీనివాస్ అధికారులకు సూచించారు. దాని హద్దులు నిర్ణయించకపోవడంతో మట్టి, గ్రానైట్ తరలిపోతుందని, ప్రభుత్వానికి నష్టం వాటిల్లుతుందని విప్ తెలిపారు.
ప్రభుత్వ భూమిలోని గుట్టల నుంచి మట్టి, గ్రానైట్ అక్రమంగా తరలించిన వారి నుంచి పెనాల్టీ వసూలు చేయాలని ఆదేశించారు.
జిల్లాలోని ప్రభుత్వ భూముల వివరాలు గూగుల్ మ్యాప్ లో కనిపించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.
సమావేశంలో జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్, ఆర్డీఓ లు
ఆనంద్ కుమార్ ,మధు సూదన్
ప్రభుత్వ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.