*పదిహేను గొర్లు మృతి.పది గొర్లకు గాయాలు
- రెండు లక్షల వరకు ఆర్థికంగా నష్టం.
- ప్రభుత్వం ఆదుకోవాలని ఐలయ్య ఆవేదన.
బలగం టీవి .. ముస్తాబాద్
ముస్తాబాద్ మండలం పోతుగల్ గ్రామంలో గంగాల ఐలయ్యకు చెందిన గొర్రెల మందపై కుక్కలు దాడి చేశాయి.తెల్లవారుజామున దాడి చేయడంతో 15 గొర్లు ఈ దాడిలో చనిపోయాయి పది గొర్లకు గాయాలయ్యాయి.మా జీవనోపాధి అంతా గొర్ల పెంపకం పైన ఆధారపడి ఉన్నామని దాదాపు రెండు లక్షల వరకు ఆర్థికంగా నష్టం జరిగినట్టు ఐలయ్య ఆవేదన వ్యక్తం చేశారు.ప్రభుత్వం వెంటనే స్పందించి ఆదుకోవాలని కోరారు. గతంలో కూడా ఇదే మండలంలోని గూడూరు గ్రామంలో కూడా గొర్రెల మందపై స్వైర విహారం చేసి చంపాయని ఎప్పుడు ఏ మందపై దాడి చేస్తాయోనని భయం భయంగా ఉందని గ్రామస్తులు తెలిపారు.ఈ సందర్బంగా ధర్మేందర్ మాట్లాడుతూ గత సంవత్సరం నవంబర్ 30 ఎన్నికల రోజున ఓటు వేసేందుకు వచ్చిన వారిపై కూడా దాదాపు 10 మందిని ఒకే కుక్క కరిచిందని తెలిపారు.రోజు ఎక్కడో ఒకచోట చిన్నపిల్లలు వృద్ధులు మూగజీవాలపై కుక్కలు దాడి చేస్తూనే ఉన్నాయన్నారు.నిర్లక్ష్యం చేస్తే ఇంకా దాడులు జరిగే అవకాశం ఉందని గ్రామపంచాయతీ గాని సంబంధిత అధికారులు కానీ చర్యలు తీసుకొని కుక్కలు మాత్రమే కాదు కోతుల బెడద కూడా ఎక్కువగా ఉందని వాటి బెడద కూడా లేకుండా చేయాలని విజ్ఞప్తి చేశారు.శునకాలు గుంపులు గుంపులుగా స్వైర విహారం చేస్తూ రాత్రిళ్ళు విపరీతమైన అరుపులతో ప్రజలపై దాడి చేస్తూ నిద్రలు కూడ పట్టకుండా చేస్తున్నాయని తెలిపారు.ప్రతి రోజు పాఠశాలకు వెళ్లే విద్యార్థులపై ఎప్పుడు ఎక్కడ దాడి చేస్తాయోనని భయంగా ఉందన్నారు.ప్రభుత్వం గ్రామపంచాయతీ పరిధిలో ప్రత్యేక దృష్టితో చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరారు.
