ఎల్లారెడ్డిపేట
గౌరవనీయులైన రేవంత్ రెడ్డి కి మనవి దయచేసి నా సమస్య పరిష్కారం చేయండి నా సమస్య ఏందంటే నేను తెలంగాణ ప్రభుత్వంలో 2018 కన్నా ముందు 84 వేల రూపాయలు క్రాప్ లోన్ తీసుకున్నాను. దానికి సంబంధించి రుణమాఫీలో నేను అర్హుడ్ని నీకు రుణమాఫీ వర్తిస్తాదని బ్యాంక్ అధికారులు వ్యవసాయ అధికారులు చెప్పారు. నేను గత ఆరోమాసంలా నుండి బ్యాంకుల చుట్టూ వ్యవసాయ అధికారుల చుట్టూ తిరుగుతా ఉంటే నాకు రుణమాఫీ కాలేదు ఎందుకంటే నన్ను బతికున్న వ్యక్తిని చనిపోయినట్టు సృష్టించారు. దీనిపై నేను బ్యాంకుల చుట్టూ వ్యవసాయ అధికారుల చుట్టూ తిరిగి విసిగి వేసారి పోయాను నేను వ్యవసాయం చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకునే వాడిని.నా రుణమాఫీని కాకుండా నేను చనిపోయినట్టు రికార్డుల్లో సృష్టించారు.ప్రభుత్వం మారింది ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం నా 84,000 రుణమాఫీని క్లియర్ చేసి నా పాస్ బుక్కు నాకు ఇప్పించగలరని కొత్త ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ని కోరుతున్న నన్ను గత ఆరు మాసం నుండి టిఆర్ఎస్ పార్టీ నాయకులు బ్యాంకు అధికారులు వ్యవసాయ అధికారులు నన్ను తీవ్ర ఇబ్బందులు పెట్టారు.నా ఆరోగ్యం బాగాలేదు ఆర్థికంగా చితికిపోయాను దయచేసి మీ ప్రభుత్వం అయినా నా రుణమాఫీ చేసి నాకు సంబంధించిన భూమి పాసుబుక్కులు ఇప్పించగలరని మనవి లేనిపక్షంలో నేను ఏ క్షణానైనా ఆత్మహత్య చేసుకుంటా సోషల్ మీడియా ద్వారా తెలిపారు.