బలగం టీవీ, రాజన్న సిరిసిల్ల :
రాజన్న సిరిసిల్ల జిల్లా నుండి ఆదిలాబాద్ జిల్లాకు బదిలీపై వెళ్లిన అఖిల్ మహాజన్ ఐపీఎస్ కి జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ఘనంగా ఆత్మీయ వీడ్కోలు పలికారు.
నూతనంగా బాధ్యతలు స్వీకరించిన జిల్లా ఎస్పీ మహేష్ బి గితే ఐపిఎస్ కి జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ఘనంగా స్వాగతించారు.
ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ చంద్రయ్య, డిఎస్పీ లు చంద్రశేఖర్ రెడ్డి, మురళి కృష్ణ,అడ్మినిస్ట్రేషన్ అధికారి పద్మ, సి.ఐ లు,ఆర్.ఐ లు,ఎస్.ఐ లు, ఆర్.ఎస్.ఐ లు సిబ్బంది పాల్గొన్నారు.