మండేపల్లిలో ఘనంగా ఉచిత కంటి వైద్య శిబిరం..

0
45
  • 30 మందికి కంటి పరీక్షలు.. నలుగురికి ఉచిత శస్త్రచికిత్సలు
  • శ్రీ భవానీ ఐ క్లినిక్ & ఆప్టికల్స్ సహకారంతో ఏర్పాటు

బలగం టీవీ, తంగళ్ళపల్లి:

రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్ళపల్లి మండలం మండేపల్లి గ్రామ రెడ్డి సంఘ భవన కార్యాలయంలో ఆదివారం ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించారు. గ్రామ సర్పంచ్ గాదగోని సాగర్ ఆధ్వర్యంలో జరిగిన ఈ శిబిరానికి సిరిసిల్లలోని శ్రీ భవానీ ఐ క్లినిక్ & ఆప్టికల్స్ వారు వైద్య సేవలు అందించారు.

ఈ శిబిరంలో భాగంగా సుమారు 30 మంది గ్రామస్తులకు వైద్యులు కంటి పరీక్షలు నిర్వహించారు. ప్రధానంగా దగ్గర చూపు, దూరం చూపు, తలనొప్పి మరియు మోతి బిందువు (Cataract) సమస్యలతో బాధపడుతున్న వారిని పరీక్షించి, తగిన మందులను సూచించారు. వీరిలో తీవ్రమైన కంటి సమస్యలతో బాధపడుతున్న నలుగురిని గుర్తించి, వారికి ఉచితంగా కంటి ఆపరేషన్లు నిర్వహించనున్నట్లు సర్పంచ్ సాగర్ ఈ సందర్భంగా తెలిపారు.

సర్పంచ్ గాదగోని సాగర్ మాట్లాడుతూ.. గ్రామంలోని సామాన్య ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందుబాటులో ఉంచాలనే ఉద్దేశంతో ఈ శిబిరాన్ని ఏర్పాటు చేశామని, భవిష్యత్తులో కూడా మరిన్ని సేవా కార్యక్రమాలు చేపడతామని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ యాస సందీప్, అమరాగొండ ప్రభుదాస్, వైద్య సిబ్బంది మరియు గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here