శ్రీ దుర్గా భవాని ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో శాలువాలతో అభినందనలు..
బలగం టీవీ, ఇల్లంతకుంట:
ఇల్లంతకుంట మండలంలోని అనంతారం గ్రామంలో శుక్రవారం శ్రీ దుర్గా భవాని ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో నూతనంగా ఎన్నికైన గ్రామ పాలకవర్గానికి ఘన సన్మానం నిర్వహించారు. ఈ సందర్భంగా నూతన సర్పంచ్ వొల్లల రజిత వెంకటేశం, ఉప సర్పంచ్ కదం జయంత్ లతో పాటు వార్డు సభ్యులను శాలువాలతో సత్కరించి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో దుర్గా భవాని ఉత్సవ కమిటీ సభ్యులు, గ్రామస్తులు,యువత పెద్ద సంఖ్యలో పాల్గొని నూతన పాలకవర్గానికి తమ మద్దతు తెలియజేశారు.గ్రామ అభివృద్ధికి అందరూ కలిసికట్టుగా పని చేయాలని ఈ సందర్భంగా పలువురు ఆకాంక్ష వ్యక్తం చేశారు.
