సిరిసిల్లలో ఘనంగా ఇఫ్తార్ విందు, మత సామరస్యానికి ప్రతీకగా నిలిచిన వేడుక…

0
63

బలగం టీవీ, రాజన్న సిరిసిల్ల:

సిరిసిల్ల పట్టణంలోని 26వ వార్డులో రంజాన్ పవిత్ర మాసాన్ని పురస్కరించుకుని కౌన్సిలర్ నెలూట్ల నరేష్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందు ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షులు తోట ఆగన్న, పార్టీ రాష్ట్ర నాయకులు చీటి నర్సింగరావు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ముస్లిం సోదరులతో కలిసి వారు ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొన్నారు. అనంతరం ఉపవాస దీక్షలను విరమించిన ముస్లింలకు హృదయపూర్వక రంజాన్ శుభాకాంక్షలు తెలియజేశారు.

ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, రంజాన్ మాసం క్రమశిక్షణకు, దాతృత్వానికి నిలువుటద్దమని పేర్కొన్నారు. సమాజంలో మతాలకతీతంగా అందరూ కలిసిమెలిసి ఉండాలని, ఇలాంటి ఇఫ్తార్ విందులు ప్రజల మధ్య సౌహార్దతను, ఐక్యతను మరియు పరస్పర గౌరవాన్ని మరింత పెంపొందిస్తాయని వారు ఆకాంక్షించారు.

ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షులు జిందం చక్రపాణి, మున్సిపల్ వైస్ చైర్మన్ దార్ల సందీప్, వివిధ వార్డుల కౌన్సిలర్లు, ప్రజాప్రతినిధులు, పార్టీ ముఖ్య నాయకులు మరియు పెద్ద సంఖ్యలో ముస్లిం సోదరులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here