బలగం టివి , , బోయినిపల్లి;
రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినిపల్లి మండలం నీలోజిపల్లి గ్రామంలో సర్పంచ్ కూస పద్మ-రవీందర్,ఉప సర్పంచ్ వార్డు సభ్యులకు ఘన సన్మానం చేశారు.పదవి బాధ్యతలు చేపట్టి విజయవంతంగా ఐదేళ్లు పూర్తయిన సందర్భంగా గ్రామ పంచాయితీ కార్యాలయంలో సర్పంచ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సందర్భంగా ఆధ్వర్యంలో వార్డు సభ్యులతో పాటు గ్రామ కార్యదర్శి రాజశ్రీ మరియు గ్రామ పంచాయితీ సిబ్బందికి శాలువాలతో సన్మానించి సత్కరించారు.
ఈ సందర్భంగా సర్పంచ్ కూస పద్మ-రవీందర్ మాట్లాడుతూ: ఐదు సంవత్సరాల పాటు గ్రామ సర్పంచ్ గా నన్ను గెలిపించి ఆదరించి, గ్రామ అభివృద్ధికి సహకరించిన గ్రామ ప్రజలకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు
ఈ కార్యక్రమంలో గ్రామస్తులు, తదితరులు పాల్గొన్నారు.