ఇల్లంతకుంట లో నూతన పాలక వర్గానికి ఘన సన్మానం..

0
267

బలగం టీవీ, ఇల్లంతకుంట:

ఇల్లంతకుంట మండల కేంద్రంలోని గొల్ల కుర్మ సంఘం ఆధ్వర్యంలో నేడు నూతనంగా ఎన్నికైన గ్రామ సర్పంచ్ మామిడి రాజు, వార్డు సభ్యులు దయ్యాల శ్రీలత – మహేష్, రేగుల కార్తీక్, ఎర్రోజు దీపిక – రవితేజ, మామిడి సుశీల, మామిడి శ్రీను, కొట్టె ప్రమీల – వెంకన్న, అంతటి శ్రీకాంత్, కూనబోయిన ఎల్లవ్వ – దేవయ్య, కూనబోయిన రఘు లను శాలువాలతో సత్కరించి శుభాకాంక్షలు తెలియజేసారు.

ఈ సందర్బంగా సర్పంచ్ మామిడి రాజు మాట్లాడుతూ.. ఎన్నికల్లో ఇచ్చిన హామీలకు కట్టుబడి ఉంటానని, గొల్ల, కుర్మ సంఘం అభివృద్ధి కోసం కృషి చేస్తానని అన్నారు. ఈ కార్యక్రమంలో గొల్ల, కుర్మ సంఘం అధ్యక్షుడు బైరి బాలయ్య, గౌరవ అధ్యక్షుడు ఒగ్గు నర్సయ్య, ఉపాధ్యక్షులు మ్యాకల ఐలయ్య, ఎగుర్ల శ్యామ్, చెలిమిల్ల శ్రీనివాస్, కోశాధికారి ఎగుర్ల శ్రీనివాస్, సహాయ కార్యదర్శి బైరి కనుకయ్య, గొల్ల కుర్మ సంఘం సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here