బలగం టివి, ఎల్లారెడ్డిపేట
ఇప్పటివరకు 48 మందికి బ్లడ్ డొనేట్ చేసి ఎందరికో ఆయుష్ ను నింపిన బ్లడ్ డొనేట్ దాతకు శుక్రవారం ప్రశంసా పత్రం అనుకున్నాడు.వివరాలలోకి వెళితే ఎల్లారెడ్డిపేట మండల కేంద్రానికి చెందిన వంగ గిరిధర్ రెడ్డి శుక్రవారం హైదరాబాద్ వెళ్లి చిరంజీవి బ్లడ్ బ్యాంకులో రక్తదానం చేసి బ్లడ్ బ్యాంక్ ఇన్చార్జ్ స్వామి నాయుడు చేతుల మీదుగా ప్రశంస పత్రాన్ని అందుకున్నాడు.గతంలో చిరంజీవి,పవన్ కళ్యాణ్,బ్లడ్ బ్యాంక్ సంస్థ నుండి వివిధ మెమొంటోలతో పాటు సర్టిఫికెట్లను అందుకున్నాడు. స్థానిక రెడ్డిలు, ప్రజా ప్రతినిధులు పలువురు తనకు అభినందనలు తెలిపారు.