నెరవేరిన ఎన్నో ఏళ్ల బాలికల హాస్టల్ కల..

0
211

బలగం టీవీ, రాజన్న సిరిసిల్ల:

-10 కోట్లతో అగ్రహారం కాలేజ్ కి బాలికల హాస్టల్ మంజూరు

రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ నియోజకవర్గ పరిధిలోని అగ్రహారం డిగ్రీ కళాశాలలో బాలికల హాస్టల్ నిర్మాణానికి 10 కోట్ల నిధులు మంజూరు చేస్తూ ఎడ్యుకేషన్ కమిషనర్ ఉత్తర్వుల జారీ చేశారు. గతంలో ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ఒక కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా కళాశాల ప్రిన్సిపల్,విద్యార్ధినీలు కళాశాలలో హాస్టల్ వసతి సరిగా లేకపోవడంతో ఇబ్బందులు పడుతున్నామని, హాస్టల్ నిర్మాణం చేయవలసిందిగా కోరుతూ వినతి పత్రం అందజేయగా వెంటనే స్పందించిన ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తో మాట్లాడి బాలికల హాస్టల్ నిర్మాణం చేపట్టవాల్సిందిగా కోరగా తక్షణమే స్పందించి హాస్టల్ నిర్మాణం కోసం 10 కొట్లు నిధులు మంజూరు చేశారు. కాగా బాలికల హాస్టల్ నిర్మాణం కోసం నిధులు మంజూరు కావడం పట్ల విద్యార్థులు హర్షం వ్యక్తం చేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here