బలగం టివి,తంగళ్లపల్లి
రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం మండేపల్లి శివారులో సైకిల్ పై వెళ్తున్న వ్యక్తి కి ఏపీ 15 జెడ్0082 బస్సు ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం కెసిఆర్ నగర్ లోని 74 వ బ్లాక్ కు చెందిన వోగ్గు సాయిలు అనే వ్యక్తి కుట్టు మిషన్ కార్మికునిగా గుర్తించారు. సంఘటన స్థలానికి ఎస్సై వెంకటేశ్వర్లు చేరుకొని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలించారు.