దొంగతనం కేసులో ఒక వ్యక్తికి మూడు సంవత్సరాల జైలు శిక్షతో పాటు 5000 రూపాయల జరిమానా..

0
73

బలగం టీవీ, రాజన్న సిరిసిల్ల:

దొంగతనం కేసులో ఒక వ్యక్తికి మూడు సంవత్సరాలు జైలు శిక్షతో పాటు 5000/- రూపాయల జరిమానా విధిస్తూ సిరిసిల్ల ప్రథమ శ్రేణి న్యాయమూర్తి ప్రవీణ్ శుక్రవారం తీర్పు వెల్లడించినట్లు పట్టణ సిఐ కృష్ణ తెలిపారు.

ఈ మేరకు వెంకటరావునగర్ కు చెందిన గూడెం శంకర్ సన్నాఫ్ నారాయణ అను అతడు వ్యాపారం చేసుకుని జీవిస్తాడు తేదీ:-07.10.2025 రోజున రాత్రి 10 గంటల సమయంలో నేను గేటుకు తాళం వేసి ఇంటిలో పడుకొని ఉదయం అందాదా 4:00 గంటలకు ఇంట్లో నుండి బయటికి వచ్చి చూడగా పవర్లూంకు సంబంధించిన నాలుగు ఇనుప తాలీలు కనిపించలేదు. వాటి ఒక్కొక్కదాని విలువ 1500/- రూపాయలు ఉంటుంది.నేను తదుపరి సీసీటీవీ కెమెరాను చెక్ చేయగా అందాదా రాత్రి 11:00 గంటల సమయంలో సిరిసిల్లకు చెందిన పడిగల లక్ష్మణ్ అనే వ్యక్తి మా యొక్క కాంపౌండ్ వాళ్ గోడను దూకి ఇంటిలోకి ప్రవేశించి నాలుగు ఇనుప తాలేలను తీసుకొని వెళ్ళినట్లుగా ఉన్నది. అతనిపై తగు చర్య తీసుకోగలరు అని దూడం శంకర్ అను అతను సిరిసిల్ల పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా ఇప్పటి ఎస్సై గారు అయినా కే. వినీత రెడ్డి గారు ఎఫ్ఐఆర్ నమోదు చేసి దొంగతనం చేసిన పడిగెల లక్ష్మణ్ సన్నాఫ్ లింగయ్య ఇందిరానగర్ సిరిసిల్ల అను అతన్ని అరెస్టు చేసి రిమాండ్ కు తరలించి అనంతరం కోర్టులో ఛార్జ్ షీట్ దాఖలు చేసినారు.తర్వాత సీఎంఎస్.ఎస్ఐ. శ్రావణ్ గారి ఆధ్వర్యంలో కోర్ట్ కానిస్టేబుల్ వేముల నరేష్ ఆరు (6) మంది సాక్షులను కోర్టులో ప్రవేశపెట్టినారు. ప్రాసిక్యూషన్ తరపున పబ్లిక్ ప్రాసిక్యూటర్ చేలుమల సందీప్ గారు వాదించగా కేసు పూర్వాపరాలు పరిశీలించిన న్యాయమూర్తి ఏ ప్రవీణ్ నేరస్తుడు అయిన పడిగే లక్ష్మణ్ కు మూడు సంవత్సరాల కఠిన కారాగారా జైలు శిక్షతోపాటు 5000/- రూపాయల జరిమానా విధించడం జరిగిందని సిరిసిల్ల పట్టణ సిఐ కృష్ణ తెలిపారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here