8 మందికి మాత్రమే జ్వరాలు ఉన్నాయి డాక్టర్ స్రవంతి
పదిర గ్రామ ప్రజలు భయపడాల్సిన అవసరం లేదు
బలటం టివి ,ఎల్లారెడ్డిపేట:
పదిర గ్రామంలో శనివారం రోజు ప్రజలకు వైద్య పరీక్షలు నిర్వహించగా 8 మందికి మాత్రమే జ్వరాలు ఉన్నాయని కావున ప్రజలు భయపడాల్సిన అవసరం లేదని డాక్టర్ స్రవంతి తెలిపారు.
ఎల్లారెడ్డిపేట మండల వైద్య అధికారి బృందం 7 బృందాలతో ఇంటింటా ఫీవర్ సర్వీ డ్రై డే నిర్వహించి గ్రామ ప్రజలకు అవగాహన కల్పించడం జరిగిందని వారు ఒక ప్రకటనలో తెలిపారు. స్థానిక గ్రామపంచాయతీ కార్యాలయం వద్ద శిబిరం నిర్వహించి 158 మందిని పరీక్షించి అందులో జ్వరంతో బాధపడుతున్న 08 మందికి పరీక్షలు చేసి తగు సూచనలు జాగ్రత్తలు తెలిపారు. ఇందులో 14 కాంటాక్ట్ వ్యక్తులకు రక్త నామూనా సేకరించి టీడీ హబ్ రాజన్న సిరిసిల్ల కు పంపించడం జరిగింది.అలాగే ప్రజలందరూ బయపడి,ప్రైవేట్ ఆసుపత్రులకు వెళ్లి డబ్బులు దుర్వినియోగం చేసుకోకుండా మండలంలో నీ పీహెచ్సీ,సిహెచ్ సి లో నీ సేవలను వినయోగించుకోవాలని తెలియజేయడం జరిగింది.
ఈ సందర్భంగా వైద్యులు మాట్లాడుతు, డెంగ్యూ ఎలిసా పరీక్ష ద్వార మాత్రమే నిర్ధారణ అవుతుంది , డెంగ్యూ పరీక్ష కేవలం జిల్లా ఆసుపత్రిలో మాత్రమె చేస్తారని ,అనుమానం ఉన్న వ్యక్తులు నిర్ధారణ కోసం ఈ ఎల్ ఐ ఎస్ ఏ పరీక్ష చేయించాలని కోరడం జరిగినది.ఈ రోజు నిర్వహించిన సర్వే ప్రకారంగా జ్వరాలు అదుపులో ఉన్నాయని ,ప్రతి రోజు జ్వరం సర్వే నిర్వహించబడుతుందని గ్రామానికి సంబంధించిన ఏఎన్‌ఎం మరియూ ఆశ అందుబాటులో ఉంటారని తెలిపారు.ఈ సర్వే లో డి ఎం హెచ్ వో డాక్టర్ శ్రీరాములు, సూపర్‌వైజర్ పద్మ, ఏం ఎల్ హెచ్ పి లక్ష్మీప్రసన్న, ఏ ఎన్ ఎం ఎస్ స్వప్నాదేవి, కమల, ప్రవీణ, అమృతవల్లి, సుమలత, రమేష్ హెచ్ ఏ, ఆశా పద్మ ,శాంతి, సునీత, మౌనిక, స్వప్న లు పాల్గొన్నారు.