ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నీ కోరిన ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్
బలగం టీవీ, హైదరాబాద్:
వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారి దేవస్థానం పరిధిలో ఆధునిక గోశాల నిర్మించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ కోరారు. వేములవాడ సమీపంలోని మరిపెల్లి గ్రామంలో గోశాల నిర్మాణానికి 40 ఎకరాల స్థలాన్ని గుర్తించినట్టు ఆయన ముఖ్యమంత్రికి తెలిపారు. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ రాష్ట్ర సచివాలయంలో సీఎం రేవంత్ రెడ్డి గారిని ఆది శ్రీనివాస్ కలిసిన సందర్భంగా ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్ బాబు, వాకిటి శ్రీహరి సహా పలువురు ప్రజా ప్రతినిధులు హాజరయ్యారు.
